Drunk and drive offenders on December 31 in Hyderabad ఆ రోజున డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారెందరంటే..

Several people caught for drunk driving on december 31 in hyderabad

Drunk and Drive, Offenders, Hyderabad police, Cyberabad Police, Rachakonda police, drunk and drive cases in hyderabad, drunk and drive cases in Cyberabad, drunk and drive cases in rachakonda, Hyderabad commissionerate, Cyberabad commissionerate, RachaKonda commissionerate, Crime

More than 1,500 people were nabbed for driving under the influence of alcohol in the city on December 31 in Greater Hyderabad. The Hyderabad police arrested 500 and Rachakonda Police 387 people respectively. The Cyberabad Police nabbed 931 people, which was less than 2019 figures.

ఆ రోజున డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారెందరంటే..

Posted: 01/04/2021 06:24 PM IST
Several people caught for drunk driving on december 31 in hyderabad

కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమా అని డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ లను పోలీసులు పక్కన బెట్టారు. కేవలం ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారిని మాత్రమే టార్గెట్ చేసిన పోలీసులు వారిపై జరిమానాలు విదిస్తూ వస్తున్నారు. అయితే అన్ లాక్ తరువాత పెద్దగా ఏ పండగ పర్వదినాలను కూడా పెద్దగా జరుపుకోని రాష్ట్ర ప్రజలు.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే నూతన సంవత్సర ఆహ్వాన పండుగను పోలీసులు టార్గెట్ చేసుకున్నారు. ఈ వేళన ఎన్నడూ మద్యం రుచించని వారు కూడా స్నేహితులతో కలసి మద్యం సేవిస్తారని తెలిసి ముందునుంచే అప్రమత్తం చేస్తూ వచ్చారు. అంతేకాదు నాలుగు రోజుల ముందునుంచే తనిఖీలు చేపట్టారు.

కాగా నూతన సంవత్సరాది వేడకలపై జరుపుకునే చర్యలపై చెక్ పెట్టని ప్రభుత్వం.. మద్యం బాబులపై మాత్రం నజర్ పెట్టింది. ఈ మేరకు వారం రోజుల ముందునుంచే మందుబాబులను పలు మాధ్యామాల ద్వారా అప్రమత్తం చేస్తూ వచ్చిన పోటీసులు మందుబాబులు మద్యం సేవించి వాహనాలను నడిపితే తప్పక చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారి చేసింది. అయితే పోలీసులు హెచ్చరికలను కూడా పెద్దగా పట్టించుకోని మందుబాబులను నూతన ఏడాది అహ్వానించే డిసెంబర్ 31న గ్రేటర్ హైదరబాద్ సహా శివారు ప్రాంతాలను ఎంచుకున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మోహరించి.. అనేక ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరిపారు.

ఫలితంగా డిసెంబర్ 31 న ఏకంగా 1500 మందిని మద్యం సేవించి వాహనాలను నడిపిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 27 నుంచే ఈ తనిఖీలు చేపట్టిన పోలీసులు నాలుగు రోజుల వ్యవధఇలో ఏకంగా 3571 మంది మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు. ఇక డిసెంబర్ 31 ఒక్కరోజునే 971 మంది మందుబాబులను సైబరాబాద్ పోలీసులు తమ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో 500 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, రాచకోండ పోలీసులు తమ కమీషనరేట్ పరిధిలో ఏకంగా 387 మంది మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles