Covid-19 vaccine dry run completed successfully in Telugu states తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా పూర్తైన కరోనా టీకా డ్ర్రైరన్

Covid 19 vaccine dry run completed successfully at 46 centres in telugu states

Covid-19 vaccine, covid vaccine Telangana, covid vaccine Andhra Pradesh, Covid-19 vaccine, covid vaccine, covid vaccine Dry Run, covid vaccine Trail Run, corornavirus, Telangana, Andhra Pradesh, coronavirus, coronavirus cases in india, coronavirus updates, worldwide coronavirus cases, covid-19, coronavirus treatment, covid-19 case tally, coronavirus latest news, coronavirus pandemic

A dry run of Covid-19 vaccination was completed successfully at 46 centres in Telugu states as part of nationwide assessment of preparedness of health authorities to implement the programme when the vaccine is made available. The trial run was conducted at 39 centres in Andhra Pradesh and seven centres in Telangana.

తెలుగు రాష్ట్రాల్లో 46 కేంద్రాల్లో విజయవంతంగా పూర్తైన కరోనా వాక్సీన్ డ్ర్రైరన్

Posted: 01/04/2021 03:02 PM IST
Covid 19 vaccine dry run completed successfully at 46 centres in telugu states

(Image source from: Zee5.com)

కరోనా మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమానికి కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో నిర్వహించిన కరోనా వాక్సినేషన్ డ్రైరన్ తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా పూర్తైంది. ఇందులో భాగంగా ముందుగా వైద్యయంత్రాన్ని సమాయత్తం చేసేంది. దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్‌ మాక్‌ డ్రిల్‌ శనివారం నిర్వహించగా, దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ పలు చోట్ల, ఉత్తర్ ప్రదేశ్ లోని ఐదు ప్రాంతాల్లో ఈ నెల ఐదున డ్రైరన్ కోనసాగనుంది, టీకా పంపిణీ కోసం ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థల పనితీరును ఈ డ్రైరన్‌ లో అధికారులు విస్తృతంగా పరిశీలించారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో 46 కేంద్రాల్లో ఈ డ్రైరన్ ప్రక్రియ కొనసాగింది. ఇందులో భాగంగా వాక్సీన్ తీసుకునే ప్రజలు అరోగ్య సిబ్బంది అనుసరించాల్సిన విధివిధానాలను మాక్ డ్రిల్ గా నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 39 కేంద్రాలతో పాటు తెలంగాణలోని ఏడు కేంద్రాల్లో ఈ డ్రైరన్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాల్లో ఈ ప్రక్రియ విజయవంతంగా కోనసాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని దు కేంద్రాల్లో గత నెల ఈ ప్రక్రియను నిర్వహించారు. కృష్ణ జిల్లాతో పాటు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ ప్రక్రియను నిర్వహించారు. ఈ కేంద్రాలకు డమ్మి లబ్దిదారులు వచ్చి కరోనా వాక్సీనేషన్ తీసుకునే ప్రక్రియతో పాటు వారి పేర్ల నుమోదు, ఆధార్ వివరాలు, చేతులను శానిటైజ్ చేసుకోవడం.. తరువాత అక్కడున్న క్యూలైన్లో ఆరు ఫీట్ల దూరంలో కూర్చోవడం.. ఆ తరువాత వాక్సీన్ తీసుకోవడం.. తరువాత అరగంట పాటు అక్కడి వార్డులో విశ్రాంతి తీసుకుని ఎలాంటి రియాక్షన్ లేదని నిర్థారించుకున్న తరువాత మరో దారిలో బయటలకు వెళ్లడంతో ప్రక్రియ ముగుస్తోంది.

ఇక ఇటు తెలంగాణలోనూ ఏడు కేంద్రాల్లో ఇవాళ ఉదయం డ్రైరన్ కొనసాగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నాలుగు కేంద్రాలతో పాటు మహబూబ్ నగర్ మూడు జిల్లాలో కేంద్రాల్లో ఈ డ్రైరన్ కొనసాగింది. హైదరాబాద్ తిలక్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు నాంపల్లి ప్రాంతీయ సుపత్రి, గాంధీ ఆసుపత్రి సహా సోమాజిగూడులోని యశోధా అసుపత్రిలో ఈ డ్రైరన్ కొనసాగిది. ఇక మహబూబ్ నగర్లో ని జనాంపేట ప్రాథమిక అరోగ్య కేంద్రంతో పాటు జిల్లా ప్రభుత్వ జనరల్ అసుపత్రితో పాటు నేహా సన్ షైన్ అసుపత్రిలోనూ డ్రై రన్ కోనసాగుతోంది. ఈ ప్రక్రియ అంతా వ్యాక్సినేషన్‌ సమయంలో సజావుగా సాగేలా సిబ్బందికి అవగాహన కల్పించడం కోసమే ఈ డ్రైరన్‌ చేపట్టారు.

డ్రైరన్ కోనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని తిలక్ నగర్ ప్రాథమిక అరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన టీకా మాక్‌ డ్రిల్‌ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళసై స్వయంగా వెళ్లి పరిశీలించారు. టీకా ఇచ్చాక ఏవైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తక్షణం అందించాల్సిన చికిత్స గురించి డ్రైరన్‌ మాక్‌డ్రిల్‌ నిర్వహించిన విధానాన్ని కూడా అక్కడి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. టీకా లబ్ధిదారులు కేంద్రానికి వచ్చేలా సమీకరించడం, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వరుసల్లో నిలబెట్టడం, వారి నుంచి సమాచారాన్ని కొ-విన్‌ యాప్ లో ప్రవేశపెట్టడం తదితర అన్ని దశలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడి అరోగ్యశాఖ అధికారులతో ఆమె చర్చించారు, ఈ ప్రక్రియ గురించి వారు గవర్నర్ కు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles