Somu Veerraju sensational comments on Amaravati నవ్యాంధ్ర రాజధానిపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Andhra bjp president somu veerraju sensational comments on amaravati

Andhra BJP President, Somu Veerraju, Amaravati, Three Capitals, Central Institutions, Indian Kisan Sangh, Tulluru, defencr academy, nimbakur, PM Modi, Andhra Pradesh, Politics

The BJP Andhra Pradesh state president Somu Veerraju said the capital of the state should remain at Amaravati and asserted that they had no other chance. He said Prime Minister Modi was doing all the development in the capital and the central institutions would remain in Amaravati even if the state government changed capitals.

నవ్యాంధ్ర రాజధానిపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Posted: 12/14/2020 02:03 PM IST
Andhra bjp president somu veerraju sensational comments on amaravati

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని ఎంపిక చేయగా, ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో రాజధాని ప్రాంత రైతుల, ప్రజలు గత ఏడాది కాలంగా ఈ విషయమై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేస్తున్న వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలన్న విషయాన్ని కూడా ఆయన కండబద్దలు కొట్టినట్టు చెప్పారు.  ఏపీ రాజధాని అంశం ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న తరణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి కంటగింపుగా మారాయి,

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఈ క్రమంలో ఒక్క రాజధానిని మాత్రమే అభివృద్ది చేయడానికి బదులు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని అధికార వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని అందుకు అనుగూణంగా పావులు కదిపింది. గత ఏడాదిన్నర కాలంగా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడంలో నాన్చుడు ధోరణి అవలంభించిన బీజేపి తాజాగా కుండబద్దలు కొట్టినట్టు నిర్ణయాన్ని వెల్లడించింది, ఏపీ రాజధాని విషయంలో బీజేపీ వైఖరి ఏమిటో ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టతనిచ్చారు. అదికూడా తుళ్లూరులో జరిగినభారతీయ కిసాన్ సంఘ్ సమ్మేళన్ లో ఆయన మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు,

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బీజేపీ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇందులో రెండో ఆలోచనకు తావు లేదని కుండ బద్దలు కోట్టారు. ఇక తన మాటలకు రాష్ట్రప్రజలు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా వుందని, తాను ఈ వ్యాఖ్యలు ప్రధాని మోడీ ప్రతినిధిగానే చేసినట్లు ఆయన చెప్పుకోచ్చారు. అమరావతిలో రూ. 1800 కోట్లతో నిర్మిస్తున్న ఎయిమ్స్ ఆసుపత్రి ఆగలేదని, దుర్గమ్మ ఫ్లైఓవర్ ను పూర్తి చేశామని... మోదీ అమరావతి వైపే ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఏపీ బీజేపీ కార్యాలయాన్ని కూడా విజయవాడలోనే కడుతున్నామని చెప్పారు. బీజేపీ మాట తప్పే పార్టీ కాదని అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ తరపున ఉద్యమం చేస్తామని చెప్పారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి అధికారాన్ని అందిస్తే... అమరావతిని మరింత అభివృద్ది చేస్తామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles