Major outbreak of coronavirus inside IIT Madras చెన్నై ఐఐటీలో కరోనా కలకలం.. విద్యార్థులకు, సిబ్బందికి సోకిన మహమ్మారి

Iit madras turns into covid 19 cluster 71 test positive campus placed under lockdown

India, Health, epidermic, mystery illness, coronavirus, Coronavirus, IIT Madras, lockdown, IIT M, Covid, symptoms, coivd-19, Greater Chennai Corporation, Chennai, Tamil Nadu

There has been a major outbreak of coronavirus inside India's premier educational institution - IIT Madras - and the campus is placed under temporary lockdown. According to health authorities, 71 Covid cases were reported in the last two weeks, of which 66 are students, four mess staff and one from resident quarters.

చెన్నై ఐఐటీలో కరోనా కలకలం.. విద్యార్థులకు, సిబ్బందికి సోకిన మహమ్మారి

Posted: 12/14/2020 12:19 PM IST
Iit madras turns into covid 19 cluster 71 test positive campus placed under lockdown

కరోనా మహమ్మారి విజృంభనతో భయాందోళనకు గురైన దేశవాసులలో టీకా వస్తుందన్న ఆశలు వారిలోని అంధోళనలను దూరం చేస్తున్నా.. ఈ టీకాలు ఎప్పటికి తమకు అందేను.. ఎప్పుడు తమలోని భయాలకు విముక్తి కలిగేనో అంటూ ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనూ కరోనా బారిన పడి పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు అసువులు బాస్తుండటంతో దేశ ప్రజల్లోనూ భయాందోళనలు కోనసాగుతున్నాయి. అయితే కరోనా ఉద్దృతి తగ్గిందని.. దీంతో ఇక లాక్ డౌన్ ముందు రోజుల మాదిరిగా పరిస్థితులు మారిపోయాయని, అన్ లాక్ 5.0 నుంచి సర్వసాధారణ స్థితికి చేరకున్నాయని ప్రజలు కూడా తమ కార్యకాలపాలను యధావిధిగా నిర్వహించుకుంటున్నారు.

అయితే కొందరు మాత్రం కరోనా నేపథ్యంలో జాగ్రత్త చర్యలు తీసుకోగా, మరికొందరు మాత్రం ఎలాంటి జాగ్రత్త చర్యలు లేకుండానే యధేశ్చగా సంచరిస్తూన్నారు, ఇలాంటి వారితో క్రమంగా దేశంలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య మళ్ల పెరిగే అవకాశాలు లేకపోలేదు. సరిగ్గా ఇక కరోనా మరికొద్ది రోజుల వ్యవధిలో దేశం నుంచి కనిపించకుండా పోతుందని.. గత కొన్న రోజులుగా కరోనా కేసులు ముపై వేలకు దిగవనే నమోదవుతన్న క్రమంలో చెన్నైలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలో కరోనా కలకలం రేగింది. క్యాంపస్ లో 66 మంది స్టూడెంట్స్ సహా ఐదుగురు సిబ్బందికి వైరస్ సోకింది. కాగా క్యాంపెస్ లో మొత్తంగా 774 మంది విద్యార్థులు ఉన్నారని, దీంతో కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరగనుందని వైద్య నిపుణులు హెచ్చరించడంతో, తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ ఐఐటీని మూసి వేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది.

ఎవరి నుంచి కరోనా క్యాంపెస్ లోకి ప్రవేశించిందో తెలియదుగానీ, ఒకే రోజులో 32 మంది వైరస్ బారిన పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు, ఐఐటీలోని అన్ని విభాగాలు, లైబ్రరీని వెంటనే మూసివేస్తున్నామని, అధ్యాపకులు, ఇతర సిబ్బంది, పరిశోధకులు, ప్రాజెక్టుల సిబ్బంది ఇంటి నుంచి పని చేయాలని సూచించామని పేర్కొన్నారు. ఇక క్యాంపస్ లో ఉన్న విద్యార్థులు, హాస్టల్ గదుల్లో మాత్రమే ఉండాలని, బయటకు రావద్దని, కరోనా నిబంధనలన్నీ పాటించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించాలని, భౌతికదూరాన్ని పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఓ సర్క్యులర్ ను విడుదల చేసింది. విద్యార్థులు, సిబ్బందిలో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారు అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Health  epidermic  Coronavirus  IIT Madras  lockdown  IIT M  Covid  symptoms  coivd-19  Chennai  Tamil Nadu  

Other Articles