From Jan 1, inform bank or large cheques will bounce రూ. 50 వేలకు మించిన చెక్ వివరాలు చెప్పాల్సిందే.!

Making cheque payments above rs 50000 rbis new rules starting january 1

New cheque payment rules, cheque payment rules from January 2021, rbi new cheque payment rules, banking fraud, RBI, 'positive pay system', cheque payments, RBI, cheque, Personal Finance, cheque rules, bank accounts, NPCI, ATMs

In order to keep a check on the banking fraud, the Reserve Bank of India (RBI) has decided to introduce from January 1, 2021, the 'positive pay system' for cheque payments. For payments above Rs 5 lakh, banks may consider making it mandatory.

న్యూఇయర్ నిబంధన: రూ. 50 వేలకు మించిన చెక్ వివరాలు చెప్పాల్సిందే.!

Posted: 12/15/2020 01:30 PM IST
Making cheque payments above rs 50000 rbis new rules starting january 1

ఏదైనా మంచి ముహూర్తంలో ఒక చక్కని నిర్ణయాన్ని తీసుకోవాలని అందరూ భావిస్తారు. అయితే సర్వసాధారణంగా వచ్చే పండుగలు, ఇత్యాదుల రోజుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకునేవారికన్నా.. జన్మదినాలు లేదా నూతన సంవత్సరం రోజును ఇలాంటి నిర్ణయాలు తీసుకునేవారి సంఖ్య అధికం. ఇక ఇలా తాజాగా భారతీయ రిజర్వు బ్యాంకు కూడా నిర్ణయం తీసుకుంది. రానున్న నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కస్టమర్ల నగదు లావాదేవీల విషయంలో అక్రమాలు జరగకుండా మరింత కఠినతర నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది, ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై జరిగే లావాదేవీలన్నీ బ్యాంకు అధికారులు మరోమారు ధృవీకరించుకుకోవాల్సి వుంటుంది.

సరైన కారణాలు వెలువరించిన వారికి డబ్బులు ఇవ్వడంలోనూ.. ఇక డబ్బుల లావాదేవీల సమాచారం ముందుగా అందించలేకపోవడంతోనూ నగదు ఉపసంహరణ నిలిపివేసే అవకాశాలు వున్నాయి. అయితే ఈ నిబంధన అందరీకీ వర్తించదు, రూ. 50 వేలకు మించిన చెక్కుల విషయంలో మాత్రం ఈ నిబంధనలు వర్తించనున్నాయి, అర్బీఐ తీసుకువచ్చిన కీలక అంశాలను బ్యాంకు అధికారుల పాలిట శరాఘాతంలా మారనున్నాయి, ఇప్పటికే అధిక పనిభారంతో సతమతం అవుతున్న బ్యాంకు ఉద్యోగులు.. సిబ్బంది.. ఇక ఇలాంటి నిబంధనలన్నీ తీసుకువస్తే తమ పనులు ముందుకు కదిలేదెలా అని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి, రూ. 50లకు మించి చెక్కుల జారీ విషయంలో అవకతవకలను నిరోధించడంలో భాగంగా పాజిటివ్ పే విధానాన్ని అమలు చేయనున్నామని ఆర్బీఐ ఈ సందర్భంగా పేర్కొంది.

మోసపూరిత లావాదేవీలకు చెక్ చెప్పడమే లక్ష్యంగా ఈ కొత్త విధానాన్ని తయారు చేసినట్టు ఆర్బీఐ స్పష్టం చేసినా ఇది తమకు అధిక పనిబారాన్ని పెంచుతుందని బ్యాంకు అధికారులు పేర్కోంటున్నారు. ఇందులో భాగంగా రూ. 50 వేల కన్నా అధిక మొత్తానికి చెక్ ను జారీ చేసిన వ్యక్తి లేదా సంస్థ.. లబ్దిదారుడి పేరు, సొమ్ము మొత్తం వివరాలు, చెక్ నంబర్ ను బ్యాంకుకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను వివిధ మార్గాల ద్వారా పంపించవచ్చు. మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, ఎస్ఎంఎస్ ల ద్వారా ఈ వివరాలను పంపాల్సి వుంటుంది. అయితే వీటన్నింటినీ సరిచూసుకుని ఆ తరువాత చెక్ క్లియర్ చేసే అధికారికి తలకుమించిన భారం అవుతుంది.

అర్బీఐ తీసుకువచ్చిన సవరణలు అన్నింటినీ బ్యాంకు అధికారులు రెండోసారి ధ్రువీకరించుకున్న తరువాతే క్లియరెన్స్ ఉంటుంది. ఖాతాదారులు జారీ చేసిన చెక్కులు, జమ చేసిన చెక్కు వివరాలను అధికారులు సీటీఎస్ (చెక్ క్లియరింగ్ సిస్టమ్స్)తో సరిపోల్చుకుంటారు. ఈ సమాచారంలో ఏ మాత్రం తేడా ఉన్నా, ప్రెజెంటింగ్ బ్యాంకులకు సీటీఎస్ నుంచి వెంటనే సమాచారం వెళుతుంది. ఈ కొత్త విధానాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. ఇదే సాఫ్ట్ వేర్ ఇండియాలోని అన్ని బ్యాంకులకూ ఇప్పటికే చేరగా, జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. రూ. 5 లక్షల లోపు సొమ్ము విషయంలో వివరాలు తెలిపే అంశం ఖాతాదారుని ఇష్టం కాగా, అంతకు మించిన చెక్కులకు మాత్రం ఈ విధానం పాటించడం తప్పనిసరి చేసింది అర్బీఐ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  cheque  Personal Finance  cheque rules  bank accounts  NPCI  ATMs  

Other Articles