Farmer leaders on hunger strike today హస్తినలో రైతన్న ఒక్కరోజు నిరాహార దీక్ష

Agitating farmers begin day long fast to intensify protest against farm laws

farmers protest, agriculture laws, dilli chalo, hunger strike, punjab farmer protest, farmers hunger strike, Punjab farmers hunger strike, hunger strike today, delhi chalo march, delhi chalo march latest news, farmers protest in delhi, delhi farmers protest, punjab farmer protest live news, farmers protest in delhi, farmers protest in punjab, farmer protest in haryana, farmer protest today, farmer protest latest news, farmers protest, farmers protest today, farm bill, parliament farm bill

As several thousand farmers held hunger strikes and dharnas at Delhi’s border and across the country on Monday, demanding a repeal of the three recent agricultural marketing laws, the Centre continued to engage with individual elements in the farmers’ movement, in an effort to restart negotiations and broker a settlement.

నిరాహార దీక్షకు దిగిన రైతన్న.. 19వ రోజూ కోనసాగుతున్న అందోళన

Posted: 12/14/2020 11:24 AM IST
Agitating farmers begin day long fast to intensify protest against farm laws

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ బిల్లులను బేషరుతుగా ఉపసంహరించుకోవాలని దేశరాజధాని సింఘు, టిక్రీ శివార్లలో రైతులు చేస్తున్న నిరసన దీక్షలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి, ఇవాళ రైతులు నిరాహారదీక్షలకు పిలుపునివ్వడంతో ఉదయం ఎనమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వారు ఎలాంటి ఆహారం తీసుకోకుండా నిరాహార దీక్షలు చేపట్టారు, వీరికి మద్దతుగా దేశంలోని పలు ప్రాంతాల రైతులు, రైతు సంక్షేమం కాంక్షించే నేతలు కూడా సంఘీభావ నిరాహారదీక్షలకు పూనుకున్నారు. అటు పంజాబ్, హరియాణాలలో రైతు సంఘాలు కమీషనరేట్ కార్యాలయాలను ముట్టడించాయి,

ఇటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ సమాజ్ వాదీ పార్టీ నేతలు రైతులకు మద్దతుగా పలు ప్రాంతాల్లో దీక్షలకు పూనుకున్నారు. ఢిల్లీ-ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దులోని ఘజీపూర్‌ రహదారిపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధికార ప్రతినిధి రాకేశ్‌ తికాయత్‌ సహా ఇతర నాయకులు, రైతులు నిరాహార దీక్షకు కూర్చున్నారు. అటు హరియాణా సరిహద్దులోని సింఘు, టిక్రీ వద్ద కూడా అన్నదాతల నిరశన దీక్ష కొనసాగుతోంది. అటు హస్తినతో పాటు ఇటు దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షలకు రైతు సంఘాలు పిలుపునివ్వగా దాదాపుగా దేశవ్యాప్తంగా రైతుసంఘాలు ఈ పిలుపుకు స్పందించి నిరసన దీక్షలను నిర్విహిస్తున్నాయి,

అటు దేశరాజధాని ఢిల్లీలోనూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా రైతులకు మద్దతుగా ఇవాళ దీక్షను చేపట్టారు. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ గోయల్ సహా పలువురు ఎమ్మెల్యేలు రైతులకు సంఘీభావ దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో కార్పోరేట్ దోపిడికి తెరలేస్తుందని, ఇక ఆహారధాన్యాలు, కూరగాయల ధరలు పెరగడంతో దేశంలో ద్రవ్యోల్భణం పతాకస్థాయికి చేరకుంటుందని అభిప్రాయపడ్డారు, అటు పంజాబ్, హరియాణా రాష్ట్రాలలో రైతులు కమీషనర్ కార్యాలయాల ఎదుట దర్నా నిర్వహించారు.

ఇదే సమయంలో అప్ నేత, అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న రైతులను జాతివ్యతిరేకులుగా ముద్రవేస్తున్న వారిని దేశద్రోహులని, వారు తక్షణం దేశం విడిచి పాకిస్తాన్ కు వెళ్లిపోవాలని ఆయన డిమాండ్ చేశారు, తమకు అన్యాయం ఎక్కడ జరుగుతుందోనని, దేశప్రజలకు ఇక ఆకలికి ఎలా అలమటించిపోతారోనన్న అందోళనలో నిరసన దీక్షలకు దిగిన రైతులను పలువురు జాతివ్యతిరేకులని ముద్రవేస్తున్నారని అక్రోశాన్ని వెళ్లగక్కారు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నను జాతివ్యతిరేకిగా ముద్రవేస్తారా.? అని ఆయన ప్రశ్నించారు, ఇలాంటివారికి దేశంలో స్థానం లేదని విమర్శించారు,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles