Hyderabad Metro Suvarna offer draws good responce మెట్రో సువర్ణ ఆఫర్.. ఆకర్షితులవుతున్న ప్రయాణికులు

Hyderabad metro suvarna offer draws good responce from passengers

metro rail, Hyderabad metro rail, 1.7 lakh passengers, coronavirus, covid-19, Unlock 5, Metro rail services resume, Hyderabad, Telangana

Hyderabad Metro Suvarna offer draws good responce from passengers says Hyderabad Metro Rail officials, After the Covid unlock Metro had resumed its services in the October month, Since December !st the passengers mark has crossed 1.70 lakh every day.

మెట్రో సువర్ణ ఆఫర్.. ఆకర్షితులవుతున్న ప్రయాణికులు

Posted: 12/08/2020 09:51 PM IST
Hyderabad metro suvarna offer draws good responce from passengers

మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో రైల్‌కు రోజు రోజుకు ప్రయాణికుల ఆదరణ పెరుగుతుంది. ఈనెల ప్రారంభం నుంచి రోజుకు ప్రయాణికుల సంఖ్య 1.70లక్షలు దాటుతుందని మెట్రో అధికారులు వెల్లడిస్తున్నారు. సువర్ణ ఆఫర్ ప్రవేశపెట్టిన తరువాత 20శాతం ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దేశంలో ఎనిమిది నగరాల్లో మెట్రో సేవలందిస్తుండగా, అందులో నాణ్యమైన సేవలందించడంతో రెండోస్దానం హైదరాబాద్ మెట్రో దక్కించుకుంది. దీంతో అధికారులు ప్రయాణికుల సంఖ్య పెరిగేందుకు కొత్త ఆఫర్లు తీసుకొస్తున్నారు. దీనికి తోడు కోవిడ్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇతర వాహనాల్లో వెళ్లితే వైరస్ సోకే ప్రమాదముందని భావిస్తూ మెట్రో వైపు గమ్యస్దానాలకు చేరుకుంటున్నారు.

మూడు కారిడార్ల పరిధిలో రోజుకు 360 ట్రిప్పులు సర్వీసు తిరగడంతో స్టేషన్‌కు వెళ్లిన రైలు అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా రెండు నెలలపాటు కంటైన్‌మెంట్ జోన్ల పరిధిలో ఉన్న భరత్‌నగర్, ముషీరాబాద్, గాంధీ ఆసుప్రతి స్టేషన్లు తెరవడంతో ఈస్టేషన్ల నుంచి రోజుకు 4వేల మంది వెళ్లతున్నట్లు మెట్రో ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అదే విధంగా ప్రారంభంలో ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ట్రైన్లు నడిచేవి, గత వారం రోజుల నుంచి రైళ్ల వేళ్లలో మార్పులు చేస్తూ ఉదయం 6.30గంటలకు మొదటి రైలు ప్రారంభిస్తున్నారు. రాత్రి 9.30గంటలకు చివరి రైలు బయలుదేరి ఆఖరి స్టేషన్‌కు రాత్రి 10.30 చేరుకునేలా వెసులుబాటు కల్పించారు. ఈమార్పుతో మరో 5వేలు మంది ప్రయాణిలకు సంఖ్య పెరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు.

ప్రయాణికుల సంఖ్య రెట్టింపుతో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన గార్డెన్ ఫెస్టివల్‌లో మెట్రో ఐదు ప్రథమ బహుమతులు, మూడు ద్వితీయ బహుమతులు గెలుచుకుంది. త్వరలో మిగతా స్టేషన్ల పరిధిలోని ఖాళీ స్దలాల్లో పచ్చిక బయళ్లను అభివృద్ది చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రయాణికులు ఎక్కువగా ఎల్బీనగర్, దిల్‌షుక్‌నగర్,ఎంజిబిఎస్, నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి,మియాపూర్, నాగోల్, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట, జూబ్లీహిల్స్, మాదాపూర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, నారాయణగూడ స్టేషన్లు నుంచి ప్రయానిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. సాప్ట్‌వేర్ కంపెనీల సేవలు ప్రారంభమైతే మరో 60వేలు మంది పెరగవచ్చంటున్నారు. లాక్‌డౌన్ తరువాత నెలరోజుల వరకు మెట్రో పుంజుకోలేదని,ఆర్టీసీ బస్సులు ప్రారంభమైన తరువాత మెట్రో వైపు జనం మొగ్గు చూపారని వెల్లడిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh