KTR supports Bharat Bandh, participates in 'Rasta Roko' తెలుగురాష్ట్రాల్లోనూ రైతన్నకు మద్దతు.. 'భారత్ బంద్లో' పాల్గోన్న నేతలు

Bharat bandh ktr supports bharat bandh participates in rasta roko by sitiing on road

Bharat Bandh, Bharat Bandh, KTR, Kavitha, Srinivas Goud, Talasani, TRS, Left Parties, Congress, Andhra Pradesh, farmers Bharat Bandh, Farmers protest, corporates in Agri sector, farmers protest central bill, farmers produce trade and commerce, farmers empowerment and protection bill, farmers price assurance, farmers farm services act, farmers essential commodities, congress, national congress, Trianmool congress, BSP, SP, TRS, 14 Political parties, Trade Unions, Transport, Banking services

Telangana Minister KTR. Srinivas Goud, TRS MLC Kavitha, RajyaSabha MP Keshava Rao all has sat on dharna following party chief KCR's order to participate in Bharat Bandh, the bandh call given by protesting farmers against the Centre's three farm bills. In Andhra Pradesh Left parties along with Congress has staged protest in support of Farmers Bandh.

తెలుగురాష్ట్రాల్లోనూ రైతన్నకు మద్దతు.. ‘భారత్ బంద్’లో పాల్గోన్న నేతలు

Posted: 12/08/2020 09:30 PM IST
Bharat bandh ktr supports bharat bandh participates in rasta roko by sitiing on road

కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు తెలంగాణలో భారత్ బంద్ లో టీఆర్ఎస్ శ్రేణులు విరివిగా పాల్గోని రైతులకు తమ మద్దత్తును చాటాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశించడంతో ఉదయం నుంచే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసి బంద్ సంపూర్ణంగా, విజయవంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కేంద్రంతో ఇదివరకే పలు పర్యాయాలు చర్చలు జరిపి.. హస్తిన శివార్లలోని సింఘం ప్రాంతంలో తిష్టవేసుకుని.. తమ వెంట తెచ్చుకున్న ఆహారధాన్యాలతో రహదారుల పక్కనే వంటవార్పు చేసుకుని.. వెన్నులో చలి చేరుతున్నా.. మెక్కవోని ధైర్యంతో గత 13 రోజులుగా అక్కడే గడుపుతున్నారు. ఈ క్రమంలో రైతుల దీక్షలను నకీలీల దీక్షలని పలు వీడియోలు, దినసరి కూలీలను రైతులుగా చేపుతున్నారన్న వీడియోలను నెట్టింట్లో వస్తున్నా.. ఎవరెంతగా గోబెల్స్ ప్రచారం చేసినా.. తమ ఉనికిని దెబ్బతీయలేరని, వాటిని పట్టించుకోకుండా తమ డిమాండ్ల పరిష్కారం కోసమే పోరాడుతున్నారు రైతన్నలు. దీంతో దేశవ్యాప్తంగా సాయుధ బలగాలను మోహరించారు.

ఇటు తెలంగాణాలో మంత్రులు సహా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు ఎక్కడికక్కడ బంద్‌లో పాల్గొని రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు రాజుగా మారుతాడని చెప్పిన బీజేపి పాలకులు., రైతును కార్పోరేట్ బానిసలుగా మార్చడానికే చట్టాలను తీసుకువచ్చారని విమర్శించారు. రైతులకు మేలు చేస్తున్నట్లుగా ఎకరానికి కొంత సొమ్మునిస్తూనే.. వారికి తెలియకుండానే కార్పోరేట్ కంపెనీల అధిపత్య గుప్పట్లోకి వారిని పంపే ప్రయత్నం వ్యవసాయ చట్టాలతో జరుగుతోందని అరోపించారు. ఈ చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

షాద్ నగర్ లో కేటీఆర్, తుప్రాన్ లో హరీశ్ రావు, వరంగల్ లో ఎర్రబెల్లి, అలంపూర్ లో నిరంజన్, హుజురాబాద్ లో ఈటెల, ఖమ్మంలో పువ్వాడ, కరీంనగర్ లో గంగుల, కామారెడ్డిలో కవిత భారత్ బంద్ లో పాల్గోని నిరసన తెలిపారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి, ఉదయం నుంచే రవాణా సర్వీసులకు బ్రేకులు పడ్డాయి, విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద కాంగ్రెస్‌, వామపక్ష నేతలు ధర్నా నిర్వహించి రోడ్డుపై భైఠాయించారు, సీఫీఐ రామకృష్ణ, సీపీఎం మధు సహా పలువురు నేతలు ర్యాలీగా వచ్చి రాస్తారోకో నిర్వహించి ధర్నా చేపట్టారు, భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో పాఠశాలలు, విద్యాసంస్థలు మూసివేశారు, అటు విశాఖపట్పంలోనూ వామపక్ష పార్టీలు రైతులకు సంఘీభావంగా రాస్తోరోకో నిర్వహించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharat Bandh  KTR  Kavitha  Srinivas Goud  Talasani  TRS  Left Parties  Congress  AP  Farmers  political parties  Trade Unions  Politics  

Other Articles