Setback to AP govt in HC to stay on panchayat polls పంచాయతీ ఎన్నికలపై స్టేకు హైకోర్టు ‘నో’.. ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..

Hc adjourns hearing on ap govt s petition to stay on panchayat polls to 14th

Andhra Pradesh High Court, Gram Panchayat, Panchayat polls, AP Government, stay on elections, YSRCP, state election commission, Nimmagadda Ramesh, Covid-19, Coronavirus, local body elections, Andhra Pradesh, Politics

The High Court adjourned the hearing on the AP government’s petition to stay on panchayat elections to 14th. The High Court ordered the State Election Commission (SEC) to file a counter petition in this regard,

పంచాయతీ ఎన్నికలపై స్టేకు హైకోర్టు ‘నో’.. ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..

Posted: 12/08/2020 03:38 PM IST
Hc adjourns hearing on ap govt s petition to stay on panchayat polls to 14th

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. తమకు ఎలాంటి సమాచారం అందించకుండా అడుగులు వేస్తోందని ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకుండా స్టే విధించాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ఈ అంశంలో స్టే విధించడానికి నిరాకరించింది. కరోనావైరస్ మహమ్మారి జడలు విప్పిన తరుణంలో ప్రజలు ఓట్ల కోసం సామాజిక దూరం పాటించకుండా పోలింగ్ కేంద్రాలకు వస్తే.. దాని ప్రభావం ప్రజారోగ్యంపై పడే ప్రమాదముందని ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది.

ఈ ఏడాది మార్చి మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లను చేసినా.. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో వాటిని చివరి నిమిషంలో వాయిదా వేశారు. అందుకు కరోనా వైరస్ మహమ్మారి విజృంభన కారణంగా చూపారు. అనుకున్నట్లుగానే కరోనా రాష్ట్ర ప్రజలను పట్టిపీడించింది, అయితే ప్రస్తుత తరుణంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా విజయవంతంగా పూర్తైన క్రమంలో రాష్ట్రంలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ మూడు పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

అయితే అదే కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించడం సముచితం కాదని రాష్ట్రప్రభుత్వం చెబుతూవస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించడంపై ఏపీ సర్కారు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ పిటిషన్ పై హైకోర్టు విచారిస్తూ.. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలన్న నిర్ణయంపై స్టే ఇవ్వలేమని ప్రభుత్వ పిటీషన్ ను తోసిపుచ్చింది. పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కౌంటర్ దాఖలు చేయాలని అదేశించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles