2,000 pilgrims can visit Sabarimala temple daily అయ్యప్ప స్వామి భక్తులకు శబరిమల దేవాలయం గుడ్ న్యూస్..

Sabarimala to receive 2000 pilgrims on weekdays in makaravilakku season

Sabarimala temple, Lord Ayappa Temple, Makaravilakku, Sabarimala temple news, Sabarimala Pilgrimage, Sabarimala, pilgrimage season, hill temple, Kerala government, state Health department, Covid-19 Protocol, coronavirus

Sabarimala Temple is set to receive more pilgrims with the Kerala government deciding to allow more devotees for darshan by adhering to COVID-19 protocols. Lord Ayyappa Temple opened for the famous annual Mandala-Makaravilakku pilgrimage season.

అయ్యప్ప స్వామి భక్తులకు శబరిమల దేవాలయం గుడ్ న్యూస్..

Posted: 12/03/2020 05:16 PM IST
Sabarimala to receive 2000 pilgrims on weekdays in makaravilakku season

కేరళలోని పశ్చిమ కనుమల్లో నెలకొన్న శబరిమల కొండపై వెలసిన హరిహరసుతుడు అయ్యప్పస్వామిని ప్రతీ ఏడు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కాగా, ఈ ఏడాది కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో భక్తుల దర్శనాలపై కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు పలు ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుత మండల పూజలు, మకర విళక్కు సీజన్ లో స్వామి దర్శనానికి దేశవ్యాప్తంగా అశేషసంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయినా కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో రోజుకు 1000 భక్తులను.. అందులోనూ మాత్రమే శబరిగిరీశుడి దర్శినాన్ని కల్పిస్తోంది. ఈ సంఖ్యను వారంతంలో మాత్రం రెండు వేలకు పెంచింది.

దీంతో స్వామి దర్శనానికి వెళ్లాలని భావించే భక్తులకు నిరాశే ఎదురైంది. కాగా ఇలా నిరాశ చెందిన అయ్యప్ప స్వామి భక్తుల కోసం కేరళ సర్కార్ తాజాగా శుభవార్తను అందించింది. ప్రస్తుతం రోజువారీగా అనుమతిస్తున్న భక్తుల సంఖ్యను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సంఖ్యకు రెండింతలు చేసి ఇకపై రోజుకు 2000 మంది, వారాంతంలో 3 వేల మందిని అనుమతిస్తామని పేర్కోంది. ఈ మేరకు కేరళ దేవాదాయ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ ఓ ప్రకటనను విడుదల చేశారు. అయితే స్వామి దర్శనానికి రావాలని నిర్ణయించుకున్న భక్తులందరూ తప్పనిసరిగా వర్చువల్ క్యూలో ముందస్తు దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని అదేశించారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికీ కరోనా సర్టిఫికెట్ తప్పనిసరని ఆయన తెలిపారు.

పంబ నుంచి అయ్యప్ప స్వామి సన్నిధానం చేరుకునే వరకూ వెళ్లే దారిలో కొవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ఎవరిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే కోవిడ్ కేంద్రాలలో చేరాలని ఆయన పేర్కోన్నారు. భక్తులు కరోనా నిబంధనలన్నింటినీ పాటించాలని ఆయన సూచించారు. అయితే ముందస్తుగా కేరళ సర్కారు తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా అయ్యప్ప స్వామి భక్తులు ఆంక్షల నేపథ్యంలో చతికిలపడ్డారు. కార్తీకమాసం ప్రారంభమై పక్షం రోజులు గుడుస్తున్నా అయ్యప్ప మాలలు వేసుకున్న భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మాలలో ఉన్నవారిలో అత్యధికులు ఈ సంవత్సరం కేరళ వెళ్లే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని, స్థానికంగా ఉన్న అయ్యప్ప ఆలయాల్లోనే దీక్షా విరమణలకు ఏర్పాట్లు చేస్తున్నామని గురుస్వాములు తెలియజేశారు. రవాణా సౌకర్యాల లభ్యత, ముఖ్యంగా పరిమత సంఖ్యలోనే తిరుగుతున్న రైళ్లు కూడా భక్తుల సంఖ్య తగ్గడానికి కారణమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles