Traffic cop dragged on car bonnet in Nagpur కానిస్టేబుల్ ను బానెట్ పై ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..

Nagpur shocker traffic police official dragged on bonnet of car he tried to stop

Caught on camara: Cop dragged on bonnet in Nagpur as he tries to stop the car, traffic police, car bonnet, nagpur traffic police, viral video, Traffic violation, Accident, Maharashtra, Crime

An on-duty traffic police personnel was dragged on the bonnet of a car after he attempted to stop the vehicle. The incident happened in Sakkardara area of Nagpur in Maharashtra. Later, the driver of the vehicle was arrested by the police.

ITEMVIDEOS: కానిస్టేబుల్ ను బానెట్ పై ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..

Posted: 12/01/2020 03:14 PM IST
Nagpur shocker traffic police official dragged on bonnet of car he tried to stop

సినీమాల్లో పోలీసులు కారు బానెట్ పై లేదా టాప్ పై వేలాడుతూ కరడుగట్టిన నేరాగాళ్లు పట్టుకుని కటకటాల వెనక్కి నెడుతుంటారు. అచ్చంగా సినీఫక్కీలోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లోనూ ఇలాంటి దారుణ ఘటనే వెలుగులోకి వచ్చింది. ట్రాపిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారును అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసును కారు డ్రైవర్ ఏకంగా బానెట్ పై ఎక్కించి అర కిలోమీటరు పైగా అలానే ఈడ్చుకెల్లాడు. ఈ తరుణంలో ఎదురుగా వున్న రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో రెండు ద్విచక్రవాహనాలను కూడా కారు ఢీకొనింది. ఎట్టకేలకు కారు నిలపడంతో కానిస్టేబుల్ కారు చోదకుడ్ని పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టాడు.

మహారాష్ట్రాలోని నాగ్ పూర్ నగర సమీపంలోని సక్కార్దర ప్రాంతంలో రోడ్డుపై విధులు నిర్వహిస్తోన్న ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఆపి చెక్ చేసి, సరైన పత్రాలు లేకపోతే జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలో సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తోన్న ట్రాఫిక్‌ పోలీసు ఓ కారును ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే కారు చోదకుడు మాత్రం తన వాహనాన్నే అపుతారా అన్నట్లుగా ఆగ్రహంతో ఊగిపోయాడు. తన కారును ఆపకుండా ముందుకు తీసుకు వెళ్లాడు. దీంతో ఆ కానిస్టేబుల్ కారును ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు యత్నించాడు.

అయినా కానిస్టేబుల్ ను ఏ మాత్రం పట్టించుకోని కారు డ్రైవర్.. కాను అలాగే ముందుకు పోనిచ్చాడు. అంతే ఆ దెబ్బతో కానిస్టేబుల్ కారు బానెట్ పై పడ్డాడు. తన ఎదురుగా కానిస్టేబుల్ బానెట్ పై వేలాడుతునప్పటికీ, డ్రైవర్ కారును ఆపకుండా దాదాపు అర కిలోమీటరు ముందుకు తీసుకెళ్లాడు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని ఆ కారు డ్రైవర్ ఢీ కొట్టాడు. చివరకు ఓ కాలేజీ వద్ద ఆ కారును ఆపగా, కానిస్టేబుల్ దానిపై నుంచి దిగాడు. అక్కడ స్థానికులు ఆ కారు నడిపిన వ్యక్తిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నడిపిన వ్యక్తిని అరెస్టు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

(Video Source: ETV Andhra Pradesh)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles