Trade union strike partially affects normal life దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలకు 25 కోట్ల మంది ఉద్యోగుల మద్దతు..

Trade unions and bank strike partially affects normal life in india

Tradu Unions, Public Sector Units, Banking sector, Banking unions, union econimic policies, nationwide trade union strike, central trade unions, Employee trade Unions

Banking services partially impacted at some PSBs. Normal life was partially affected in the Country due to a nationwide trade union strike, during which sporadic clashes were reported in several parts of the state. The 24-hour bandh called by a joint committee of the central trade unions in protest against the Centre's economic policies began at 6 am.

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలకు 25 కోట్ల మంది ఉద్యోగుల మద్దతు..

Posted: 11/26/2020 10:47 PM IST
Trade unions and bank strike partially affects normal life in india

కేంద్రంలోని బీజేపి నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై 24 గంటల పాటు దేశవ్యాప్త సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వున్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లతో పాటు కేంద్ర ప్రభుత్వ అధీనంలో వున్న సంస్థలు, కేంద్రప్రభుత్వం పర్యవేక్షణలో నిర్వహించబడుతున్న సంస్థల వద్ద కార్మిక సంఘాల నేతలు సమ్మెను నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఈ ఉదయం ప్రారంభమైన ఈ సమ్మె కార్మిక వ్యతిరేక విధానాల అవలంభనతో పాటు కేంద్రప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెను నిర్వహించాయి. దాదాపు 25 కోట్ల మంది సమ్మెలో భాగం అయ్యారని ప్రాథమిక అంచనాలలో తేలినట్టు కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.

ఈ సార్వత్రిక సమ్మెలో కార్మిక యూనియన్లుతో పాటు బ్యాంకింగ్ రంగ సిబ్బంది కూడా సమ్మెలకు మద్దతు తెలిపారు, ఇక సమ్మె ప్రభావంరిజిస్ట్రేషన్, నిత్యావసరాల పంపిణీ తదితర సేవలపై ప్రభావం పడుతుందని అంచనా. ఇక ఈ సమ్మెకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు పలికింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడాన్ని తాను అంగీకరించబోమని వ్యాఖ్యానించిన మంత్రి హరీశ్ రావు, వాటిని కాపాడుకునేందుకు ఐక్య ఉద్యమాలకు తమ పార్టీ సిద్ధంగా ఉంటుందని అన్నారు. తెలంగాణలో ఈ సమ్మె టీయూడబ్ల్యూజే, ఐజేయూ (ఇండియన్ జర్నలిస్ట్స్ యూనినియన్), తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ సంయుక్త కార్యాచరణ కమిటీలతో పాటు బీహెచ్ఈఎల్, బీడీఎల్ తదితర పలు కంపెనీల కార్మిక సంఘాలు మద్దతు పలికాయి.

అటు పశ్చిమ బెంగాల్ లో మాత్రం కార్మిక సంఘాట సమ్మె ఉద్రిక్తంగా మారింది, సాధరణ జనజీవనానికి దేశవ్యాప్త సమ్మె విఘాతం కలిగించింది, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు నమోదయ్యాయి. ఇవాళ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన దేశవ్యాప్త కార్మికుల సమ్మె రేపు ఉదయం వరకు కొనసాగనుంది. 24 గంటల సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి, కేంద్ర ప్రవేశపెడుతున్న కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణం ఉపసంహరించాలని కోరుతూ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి, ముఖ్యంగా సీఐటీయు, ఏఐటీయుసీ, ఐఎన్టీయుసీ, సహా పలు కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గోన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles