SBI Debit card user? Check SBI daily cash withdrawal limit for different ATM cards ఎస్బీఐ గుడ్ న్యూస్.. డెబిట్ కార్డు బట్టి నగదు విత్ డ్రా పరిధి పెంపు

Sbi debit card user check sbi daily cash withdrawal limit for different atm cards

SBI daily ATM cash withdrawal limits, SBI global international card, SBI gold international card, sbi intouch tap and go debit card, sbi mumbai metro debit card, my card international debit card, platimum international card, bank debit card, bank free transactions, bank withdraw limits

State Bank of India (SBI), country's largest banks which are also now a fortune 500 company has revised the daily ATM cash withdrawal limit for its different debit cards. At present, SBI is offering 7 different types of ATM-cum-debit cards to its account holders.

ఎస్బీఐ గుడ్ న్యూస్.. డెబిట్ కార్డు బట్టి నగదు విత్ డ్రా పరిధి పెంపు

Posted: 10/28/2020 10:57 PM IST
Sbi debit card user check sbi daily cash withdrawal limit for different atm cards

(Image source from: V6velugu.com)

భారతీయ బ్యాంకింగ్ దిగ్గజ సంస్థ ఎస్బీఐ తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్నాళ్లుగా ఉన్న నగదు ఉపసంహరణ పరిమితిని తాజాగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇన్నాళ్లు అన్ని రకాల డెబిట్ కార్టుదారులను ఒకే గాడికి కట్టేసినట్టుగా ఒకే విధమైన నగదు ఉపసంహరణ పరిమితిని విధించిన బ్యాంకింగ్ దిగ్గజం తాజాగా డెబిట్ కార్డుల రకాన్ని బట్టి పరిమితులను విధిస్తున్నట్లు తెలిపింది. దీంతో బ్యాంకు జారీ చేసే డెబిట్ కార్డులపై ఇన్నాళ్లు దృష్టి సారించని ఖాతాదారులు ఇకపై వాటిపై కూడా దృష్టి సారించేలా చేసింది.

సాధారణంగా సేవింగ్స్ అకౌంట్ హల్టర్లతో పాటు శాలరీ అకౌంట్ ఖాతారులకు.. వీరితో పాటు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ఖాతాదారులకు బ్యాంకు క్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డులనే జారీ చేసింది. అయితే బ్యాంకు అధికారులు తాజాగా తీసుకున్న నిర్ణయంతో వీరికి ఎలాంటి ప్రయోజనం ఒనగూరలేదని చెప్పాలి. ఎందుకంటే బ్యాంకు అధికారులు తాజాగా అన్ని డెబిట్ కార్డుదారులకు నగదు ఉపసంహరణ పరమితిని పెంచామని చెబుతున్నా అది వీరికి మాత్రం వర్తించది తెలుస్తోంది. వీరికి మునుపటి మాదిరిగానే రూ.20 వేల వరకు మాత్రమే నగదు విత్ డ్రా పరిమితి ఉంది.

అయితే మిగతా డెబిట్ కార్డుదారులకు మాత్రం ఎస్బీఐ తాజా ప్రకటనలో లబ్ది చేకూరింది. గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు నుంచి ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు వరకు నగదు ఉపసంహరణ పరిమితి ఏకంగా రూ. 20 వేల నుంచి లక్ష వరకు పొగడించింది. ఇక ప్రతీ ఎస్బీఐ డెబిట్ కార్డు యూజర్ కు బ్యాంకు మరో లబ్దిని చేకూర్చింది. ఇదివరకు నెల రోజుల వ్యవధిలో కేవలం ఐదు పర్యాయాలు మాత్రమే ఏటీయం కేంద్రాల నుంచి ఉచిత లావాదేవీలు జరుపుకునే పరిమితిని జులై 1 నుంచి ఎనమిది సార్లకు పొడగించింది. ఈ పరిమితి మించితే చార్జీల వడ్డన తప్పదు.

కాగా ఇదివరకు పరిమిత మేర ఏటీయం కేంద్రాల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునే ఖాతాదారులు ఇకపై మాత్రం ఏటీయం కేంద్రాల నుంచి రూ. పది వేలకు మించిన మొత్తంలో డబ్బును విత్ డ్రా చేస్తే.. తప్పక ఓటీపీలను ఎంటర్ చేయాల్సిందే. పది వేలకు మించి నగదు విత్ డ్రా చేయాలనుకుంటున్న ఖాతాదారు రిజిస్టర్ మొబైట్ కు బ్యాంకు ఓటీపిని పంపిస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేస్తేనే డబ్బు విత్ డ్రా అవుతుంది. తొలుతు ఖాతాదారులు భద్రత నేపథ్యంలో రాత్రి పూట మాత్రమే అమల్లోకి వచ్చిన ఈ నిబంధన ఇక సెప్టెంబర్ 18 నుంచి ప్రతినిత్యం అమల్లోకి వచ్చింది.

*    క్లాసిక్ మరియు మాస్ట్రో డెబిట్ కార్డు: రోజుకు రూ. 20 వేల వరకు

*    గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 40 వేలు

*    ఇన్ టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డు: రూ. 40 వేలు

*    ముంబై మెట్రో కాంబో కార్డ్: రూ. 40 వేలు

*    మై కార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్: రూ. 40 వేలు

*    గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 50 వేలు

*    ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 1 లక్ష

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles