Dubbaka bypoll: Vijayashanti fires on Minister Harish Rao హరీశ్ రావు వ్యాఖ్యలపై విజయశాంతి ఫైర్

Dubbaka bypoll congress spokesperson vijayashanti fires on minister harish rao

Dubbaka bypoll, Harish Rao, Finance Minister, Congress senior leader, Vijayashanti, congress spokesperson, cheruku muthyam reddy, deposits, Telangana, politics

Dubbaka bypoll: Telangana Congress senior Leader and spokesperson Vijayashanti fires on Minister Harish Rao over congress party not going to get deposits in the by elections which are to be held nest month in Dubbaka Assembly constituency

హరీశ్ రావు వ్యాఖ్యలతో ఉప ఎన్నికలపై అనుమానాలు: విజయశాంతి

Posted: 10/28/2020 11:15 PM IST
Dubbaka bypoll congress spokesperson vijayashanti fires on minister harish rao

దుబ్బాక ఉపఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ.. గెలుపు కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్దమయ్యేలా వుందని ఆ పార్టీ వ్యవహార శైలి చూస్తుంటే అర్థమవుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, అధికార ప్రతినిధి విజయశాంతి అన్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రావని ముందస్తుగానే మంత్రి హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యలు సందేహాలకు తావిస్తున్నాయని అమె అనుమానాలు వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికల ఫలితాలను సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ లో లెక్కించనున్నారా.? అని అమె ప్రశ్నించారు. రామలింగారెడ్డిని ఓడించిన చరిత్ర చెరుకు ముత్యంరెడ్డికి వున్నదన్న విషయాన్ని మర్చిపోరాదని అమె హితవు పలికారు.

హరిశ్ రావు వ్యాఖ్యలను బట్టి ఎన్నికలకు ముందే ఫలితాలెలా ఉండాలో టీఆర్ఎస్ నిర్ణయించిందనే విషయం కూడా ప్రజలకు అర్థమవుతోందని చెప్పారు. అయితే ఇన్నాళ్లు టీఆర్ఎస్ నేతల మాయమాటలకు లోంగి ఓట్లు వేసి ఓటర్లకు అధికార పార్టీ అరాచకాలపై ఉప ఎన్నికలలో కావాల్సినంత స్పష్టత వచ్చిందని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో జరిగే ఉపఎన్నికలో ఆయన కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నా.. టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా హరీశ్ రావుకు హైరానా ఎందుకో ఎవరికీ అంతు చిక్కడంలేదని అన్నారు. సానుభూతి ఓట్లతో ఈజీగా గెలవాల్సిన చోట ఎందుకు అంతలా శ్రమిస్తున్నారని ప్రశ్నించారు.

దుబ్బాక గెలుపోటములతో.. ఓట్ల శాతంతో ఆయన మంత్రి పదవికి లింకు ఏర్పడిందని ఇప్పటికే నియోజకవర్గ ప్రజల్లో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోందని అమె అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉపఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే... దాని ప్రభావం హరీశ్ మంత్రి పదవి మీద పడుతుందని కేసీఆర్ ఏదన్నా అల్టిమేటం జారీ చేశారా? అనే చర్చ కూడా జరుగుతోందని విజయశాంతి చెప్పారు. ఈ కారణం వల్లే ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్ కరోనాను ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే... దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారని ఓటర్లు అనుకుంటున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles