నూతనంగా ప్రారంభం చేస్తున్న తన రెస్టారెంటు స్థానిక ప్రజలకు గుర్తుండే విధంగా వినూత్న ప్రచారానికి తెరతీసి బోజన ప్రియులకు బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఓ హోటల్ యాజమానికి అదే ప్రచారం అరదండాలను వేయించింది. ప్రారంభోత్సవం రోజునే యజమానిని అరెస్టు చేసిన పోలీసులు.. హోటల్ ను కూడా సీజ్ చేశారు. అయితే ఇంతకీ ఏం జరిగిందీ అంటే.. తన హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా కేవలం రూ. 10లకే ప్లేట్ కోడి బిర్యాని అందిస్తామని అతను ప్రచారం చేశాడు. ప్రచారం చేసిన విధంగానే తన హోటల్ ప్రారంభోత్సవం రోజున వచ్చిన ప్రతీ ఒక్కరికీ రూ.10కే బిర్యానిని అందించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హోటల్ వద్దకు వచ్చి యజమానిని అరెస్టు చేసిన హోటల్ ను సీజ్ చేశారు.
తమిళనాడులోని అరుప్పుకోట్టై ప్రాంతంలో జహీర్ హుస్సేన్ (29) నూతనంగా ఓ హోటల్ ను ప్రారంభించాడు. కరోనా లాక్ డౌన్ ముగిసి ప్రజలంతా రక్షణ చర్యలు తీసుకుంటూనే జనజీవనాన్ని కొనసాగిస్తూన్న తరుణంలో తన హోటల్ కూడా కస్టమర్లు అధిక సంఖ్యలో రావాలని యోచించిన జహీర్ ప్రారంభోత్సవం రోజున ఉదయం 11`గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కేవలం రూ.10కే కోడి బిర్యానిని అందిస్తానని ప్రచారం చేశాడు. కోవిడ్ నేపథ్యంలో కొంత మందైనా తన రెస్టారెంటుకు వచ్చి బిర్యానిని సేవిస్తారని ఆశించాడు. ఇలా వచ్చినవారికి రూ. 10కే బిర్యాని అందించాలని కూడా నిర్ణయించుకున్నాడు. అయితే ఈ ప్రచారమే అతని కొంపముంచింది.
పదుల సంఖ్యలో కస్టమర్లు వస్తారని మొత్తంగా వంద నుంచి రెండు వందల మంది వరకు రావచ్చునని అంచానవేసుకోగా.. ఒక్కసారిగా ప్రచారం విపరీతంగా ప్రజల్లోకి వెళ్లడంతో వందలాది మంది కస్టమర్లు హోటల్ తెరిచే సమయానికే క్యూ కట్టారు. దీంతో ఖంగుతిన్న హోటల్ యజమాని క్యూపద్దతిలో కస్టమర్లను నిల్చోబెట్టినా.. హోటల్ లో సీట్లు సర్ధుబాటు కాకపోవడంతో వందలాది మందిని నియంత్రించడం కూడా తలనొప్పిగా మారింది. ఇక హోటల్ ఎదుట కస్టమర్లు అంతకంతకూ పెరుగుతూ రహదారిపైకి కూడా చేరుకున్నారు. దీంతో రహదారిపై వెళ్లే వాహనాలకు కూడా అంతరాయం కలిగింది. దీంతో పోలీసుల చెవిన విషయం చేరింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వాహనాలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు,.
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి నిబంధనలు కొనసాగుతున్న తరుణంలో వాటిని యధేశ్చగా ఉల్లంఘించి.. రహదారిపై వాహనాల రాకపోకలకు విఘాతం కలిగించినందుకు హోటల్ యజమాని జహీర్ హుస్సేన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని హోటల్ ను సీజ్ చేశారు. అంతకుముందు హోటల్ ఎదురుగా వందల సంఖ్యలో వున్న కస్టమర్లను తరమికోట్టారు. అయితే కస్టమర్ల కోసం హోటల్ యజమానికి ఏకంగా 2500 ప్యాకెట్ల బిర్యానిని ప్యాకెట్లను సిద్దం చేయగా, వాటిలో 500 మేర విక్రయించారు. అయితే వాటిని కోనసడానికి పోటీపడిన కస్టమలర్లు మాస్క్ ధరించడం కానీ, కరోనా నిబంధనలను పాటించడం కానీ చేయనందుకు వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more