Brahmotsavam: Malayappa Swamy attite as Kodandaramudu రాత్రికి గరుడ వాహనంపై తిరుమల శ్రీవారు..

Tirumala brahmotsavam lord malayappa swamy taken in procession attire as kodandaramudu

Tirumala Tirupati devastanam, Lord malayappa swamy as RajaMannar, Lord Malayappa swamy on Hanumantha Vahanam, Lord Malayappa swamy on Sarva Bhopala Vahanam, Lord Malayappa Swamy, Tirumala Tirupati Devasthanam, Tirumala Bramhotsavam, chinna shesha vahanam, Hamsa vahanam, covid-19, devotees

Tirumala diety Lord Malayappa Swamy, dressed in celestial attire as Kodandaramudu was taken in a procession on Hanumantha Vahanam the sixth day of Srivari Navaratri Brabmotsavam on Wednesday. Today evening the lord will take procession on Hanumantha Vahanam.

హనుమంత వాహనంపై తిరుమల శ్రీవారు.. రాత్రి గరుడ వాహనంపై..

Posted: 10/21/2020 10:19 PM IST
Tirumala brahmotsavam lord malayappa swamy taken in procession attire as kodandaramudu

కలియుగ ప్రత్యేక్షదైవం తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు ఉదయం మలయప్పస్వామి కోదండరాముడి అవతారంలో దర్శనమిచ్చారు. కోదండరాముడిగా మలయప్ప స్వామి తన భక్తాగ్రేసుడు హనుమంతుడిని వాహనంగా చేసుకుని ఊరేగుతూ భక్తులకు అభయప్రధానం చేశారు. ఈ హనుమంత వాహనంపై ఊరేగుతున్న కోదండరాముడ్ని దర్శించడం వ్ల అన్ని శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. శ్రీరామ భక్తాగ్రగణ్యుడైన హనుమంతుడు స్మరించినంతనే ధైర్యం, ఆరోగ్యం, బుద్ది, బలం, యశస్సు సిద్ధిస్తాయి. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన కలిగిన మహనీయులు. కాబట్టి వారిని చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. అలాంటి హనుమంత వాహనంపై విహరించిన స్వామి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు.

లంకాసురుడు దశకంఠుడైన రావణాసురుడ్ని యుద్దంలో అంతమొందించిన తరువాత శ్రీసీతారామలక్ష్మణులను లంక నుంచి తన భుజాలపై ఎక్కించుకుని తీసుకువచ్చారని.. దీనికి ప్రతీకగానే శ్రీవెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలలోనూ హనుమంతుడి వాహనసేవను వినియోగిస్తూ వుండటం ఆనవాయితీగా వస్తోంది. ఇక హనుమంత వాహనంపై కోదండరాముడిగా అలంకృతుడైన శ్రీమలయప్ప స్వామి భక్తులకు అభయప్రధానం చేశారు. మంగళ వాయిద్యాలు, జీయంగార్లు, పండితులు, అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక ఇవాళ రాత్రి ఏడు గంటలకు శ్రీవారి బ్రహోత్సవాలలో భాగంగా గజవాహన సేవను టీటీడీ నిర్వహించనుంది.

ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పకవిమాన సేవ, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహన సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా స్వామివారికి ఆగ‌మోక్తంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌న్నీ య‌థాత‌థంగా నిర్వ‌హిస్తారు. కరోనా ప్రభావంతో ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేశారు. ప్రతీఏడు కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్ర తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తజన సందోహానికి అభయప్రధానం చేసే శ్రీవారు ఈ సారి కరోనా నేపథ్యంలో ఆలయానికి మాత్రమే ఉత్సవాలు పరిమితమయ్యాయి, తితిదే ఈవో జవహర్‌రెడ్డి, కార్యక్రమంలో పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles