YCP MP Raju appeals Amaravati women to focus on agitation అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్దృతం చేయండీ: వైసీపీ ఎంపీ

Ysrcp rebel mp raju appeals amaravati women to focus on agitation

Raghurama Krishnaraju, Narsapuram MP, Amaravati, Capital issue, TV Serials, Agitation, Amaravati Protests, CRDA protests, Bapatla MP, Andhra Pradesh, Politics

YSRCP MP Kanumuru Raghu Ramakrishna Raju appeals women to focus on the ongoing Amaravati agitation instead focusing on TV serials and days of the protest.

అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్దృతం చేయండీ: ఎంపీ రాఘురామకృష్ణరాజు

Posted: 10/13/2020 10:12 AM IST
Ysrcp rebel mp raju appeals amaravati women to focus on agitation

(Image source from: Greatandhra.com)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధిస్తున్న ఆ పార్టీ రెబల్ నాయకుడిగా మారిన నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో తన 'రచ్చబండ' కార్యక్రమం సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రైతులు చేస్తున్న శాంతియుత ధర్నా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సినిమా శతదినోత్సవం, రజతోత్సవం, వజ్రోత్సవం లాగా, అమరావతి ధర్నా 300వ రోజు అంటూ ప్రచారం చేసుకోకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరించడంపై శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. అమరావతి రాజధానిగా ఏర్పడాలంటే మహిళాశక్తి పట్టుసాధించాలని ఆయన అన్నారు.

ముఖ్యంగా, రాష్ట్రంలోని మహిళలు టీవీ సీరియళ్లు చూసే సమయాన్ని 50 శాతం తగ్గించుకుని, కాస్త అమరావతి రైతుల సమస్యపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఎక్కడైనా మహిళలు ముందుంటే దేనికైనా శుభం జరుగుతుందని రఘురామకృష్ణరాజు అన్నారు. అమరావతి సాధించేంత వరకు మహిళలు విశ్రమించరాదని పిలుపునిచ్చారు. ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా తన పాత ఫొటో ప్రచారం చేస్తున్నారని, అదెప్పుడో మూడేళ్ల నాటి ఫొటో అని వివరించారు. అందులో ఓ రష్యన్ యువతి షాంపేన్ పోస్తుండగా, రఘురామకృష్ణరాజు తాగుతున్న దృశ్యం ఉంది. ఈ ఫొటోను రఘురామకృష్ణరాజు మీడియాకు చూపించారు.

"ఈ ఫొటో కోల్ కతాలో కానీ, హైదరాబాద్ లో కానీ తీసినది అయ్యుంటుంది. ఓ తెలుగు ఎంపీ  ఫంక్షన్ లోది అనుకుంటా. ఈ ఫొటోను నేను కూడా ఎప్పుడూ చూసుకోలేదు. బహుశా ఈ ఫొటోను పెద్దలు సుబ్బారెడ్డి గారు అందించారనుకుంటున్నాను, వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఫొటోలో చూస్తున్నట్టుగా నేను ఎవరినీ ముట్టుకోలేదు. క్రికెట్ పోటీల్లో విజేతలకు షాంపేన్ అందించడం తెలిసిందే. గెలిచినవాళ్లు కొంచెం నోట్లో పోసుకుంటారు. తాను తాగింది కూడా షాంపేనే. అది పెద్దగా మద్యం కేటగిరీలోకి కూడా రాదు. ఇక రష్యన్ యువతులు అందరి నోళ్లలోనూ షాంపేన్ పోస్తూ తన నోట్లోనూ పోశారని.. ఆ కొంచెం షాంపేన్ తాగితే మీకేంట్రా సంతోషం వెర్రివెధవల్లారా ... ఏముందిరా ఆ ఫొటోలో?" అంటూ ఆవేశంగా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles