AP HC orders CBI probe into social media comments against judges అనుచిత వ్యాఖ్యల కేసు సీబిఐకి అప్పగించిన హైకోర్టు

Ap hc orders cbi probe into social media comments against judges

AP High Court, CBI, Judiciary, Comments, Social Media, YSRCP, AP High Court, AP government, CBCID, Andhra Pradesh, Polictics

The AP High Court on Monday ordered a CBI probe into defamatory comments posted on social media against the High Court and its judges. After hearing the arguments of the AP government and CID, the High Court handed over the investigation to the CBI. The CBI directed to register cases against the accused and submit a report within eight weeks.

న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసు సీబిఐకి అప్పగించిన హైకోర్టు

Posted: 10/13/2020 10:47 AM IST
Ap hc orders cbi probe into social media comments against judges

సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అవాంఛనీయ రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. న్యాయమూర్తులపై దూషణలకు పాల్పడిన కేసును తాజాగా సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 8 వారాల్లోగా నివేదిక అందజేయాలని ఏపీ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో ఇటీవల కూడా జడ్జిలపై వ్యాఖ్యలు చేసిన వారిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా, ఈ దర్యాప్తులో సీబీఐకి సహకరించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానంలో తమకు అనుకూలంగా తీర్పులు రాకపోతే ఉన్నత న్యాయస్థానాలను అశ్రయించాలని ఇటీవల రాష్టోన్నత న్యాయస్థానం సూచించిన విషయం తెలిసిందే.

న్యాయ వ్యవస్థలపైనా, న్యాయమూర్తులపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెరిగిపోతుండడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. ఇటీవల కొన్ని ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు వచ్చిన నేపథ్యంలో జడ్జిల పట్ల అవమానకర రీతిలో పోస్టులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపైనా న్యాయస్థానం దృష్టి సారించింది. స్పీకర్ తన హోదాను కూడా విస్మరించి న్యాయవ్యవస్థలపై సభలో కాకుండా బయట వ్యాఖ్యలు చేయడాన్ని కూడా ప్రత్యేకంగా పరిగణించి విచారించక తప్పదని హెచ్చరించింది. రాష్ట్ర ప్రజలు తమను ఆశ్రయించిన సందర్భాలలో పలు పిటీషన్లను విచారించి వాటిపై తమ తీర్పులను వెలువరించడం న్యాయస్థానాల విధి అని పేర్కోన్న న్యాయస్థానం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తే ఇలాగేనే వ్యవహరించేదని ప్రశ్నించింది.

ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా.. చివరకు మీడియాలో తప్పుడు వార్తలు రాసినా వారిపై చర్యలకు ఉపక్రమించే ప్రభుత్వ వ్యవస్థం.. న్యాయస్థానాలపై వ్యతిరేకతకు, తమ తీర్పులను వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేసిన వారిపై ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఇటీవల ప్రశ్నించింది. ఇక న్యాయస్థానాలపై, న్యాయమూర్తులపై, న్యాయవ్యవస్థలపై చులకనబావంతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, చట్టసభలకు ఎంపికైన ప్రజాప్రతినిధులతో పాటు మాజీలు కూడా అనుచితంగా తమ సామాజిక మాద్యమ అకౌంట్లలో న్యాయస్థాన తీర్పులను తూలనాడుతూ పోస్టులు పెట్టారని వాటన్నింటిపైనా ధర్యాప్తు చేయాలని తాజాగా సీబిఐని న్యాయస్థానం అదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP High Court  CBI  Judiciary  Comments  Social Media  YSRCP  AP High Court  AP government  CBCID  Andhra Pradesh  Polictics  

Other Articles