High Court serious on Govt over corona deaths న్యాయస్థానాలకు కూడా తప్పుడు లెక్కలా?: హైకోర్టు

Telangana high court serious on govt over corona deaths

Telangana High court, state government, health department, coronavirus deaths, covid-19, corona actual deaths, Telangana corona cases, corona pandemic, Politics

Telangana High court reacts seriously on the state government over coronavirus deaths in the state, asks why the government misleads the actual deaths during the pandemic.

న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టిస్తారా: తెలంగాణ హైకోర్టు

Posted: 10/13/2020 09:26 AM IST
Telangana high court serious on govt over corona deaths

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారిని నియంత్రించి.. ప్రజలను వేగంగా అప్రమత్తం చేయలేకపోయిన ప్రభుత్వం.. ఇటు కేసుల సంఖ్య విషయంతో పాటు అటు మరణాల విషయంలోనూ తప్పుడు లెక్కలు చూపుతూ మభ్యపెడుతున్నారని తెలంగాణ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ నియంత్రణ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కోంది, రాష్ట్రంలో అటు కరోనా కేసుల సంఖ్యతో పాటు ఇటు కోవిడ్ మరణాల సంఖ్యను కావాలనే తక్కువ చేసి చూపుతున్నారని మండిపడింది.

ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన వెద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా తగ్గిందని కోర్టుకు తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కోర్టు స్పందిస్తూ... టెస్టులు చేయనప్పుడు కరోనా కేసులు ఎన్నున్నాయో ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. తెలంగాణలో కరోనా కేసులు వెలుగుచూస్తున్న నాటి నుంచి తాము ప్రభుత్వంతో పాటు వైద్యశాఖ అధికారులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఆరోగ్యశాఖ అధికారులను కూడా అనేక పర్యాయాలు పలు సూచనలు చేసినా లక్షపెట్టలేదన్న విషయాన్ని హైకోర్టు మరోమారు గుర్తుచేసింది. కరోనా కేసుల విషయంలోనే ఈ వైరస్ బారిన పడినవారు ఎంత మంది, వారి కాంటాక్టు కేసలు ఎన్ని అన్న వివరాలను ఎప్పడ్నించి రాస్తున్నారో విషయం తమకు తెలుసునని వ్యాఖ్యానించింది.

ఇక రాష్ట్రంలో కరోనా మరణాలు ఎన్నో జరుగుతున్నా ఆ సంఖ్యను కేవలం పది, పదకోండు మేర చూపించడం వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభమేంటి అని న్యాయస్థానం ప్రశ్నించింది, మరణాల విషయంలో లెక్కలు ఎలా వున్నాయో పలు దినపత్రికలు వెలుగులోకి తీసుకోచ్చిన కథనాలను బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చునని అభిప్రాయపడింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ లు తక్కువగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేసింది. వెంటిలేటర్లకు సంబంధించి సరైన సమాచారాన్ని కూడా వెల్లడించడం లేదని చెప్పింది. తప్పుడు లెక్కలతో హైకోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles