Trump announces relaxations in H-1B, L-1 travel ban హెచ్‌-1బీ వీసా నిషేధాల్లో సడలింపులు

Us visa india latest donald trump admin announces relaxations on h1b visa

H1B visa, H1B visa news, H1B visa USA, H1B visa meaning, H1B visa suspension, H1B visa 2020, H1B visa validity, H1B visa India, H1B visa status, US Visa India, US Visa news, US Visa application, US Visa ban, US Visa types

In good news for Indians working in the US, the Donald Trump administration has announced relaxations in some rules for H1B visas. The relaxations also include the family members of the H-1B, L-1, and certain categories of J1 visas. The decision comes after American President Donald Trump had signed an executive order.

హెచ్‌-1బీ వీసా ఉందా.. మీరు పూర్వపు ఉద్యోగంలో చేరవచ్చు..

Posted: 08/13/2020 10:49 PM IST
Us visa india latest donald trump admin announces relaxations on h1b visa

అగ్రరాజ్యంలో ఉద్యోగం లభించాలనేది.. స్వేచ్చా, స్వతంత్రంతో తమ ఉద్యోగాలు చేయాలన్నది అనేక మంది నేటి యువతరం కల, ఈ కలను అనేక మంది భారత్ సహా వివిధ దేశాల యువత ప్రతీ నిత్యం సాకంరం చేసుకునేందుకు పోటీ పడుతూనే వుంటారు, డోనాల్ట్ ట్రంప్ అగ్రరాజ్య అధ్యక్షుడి పీఠాన్ని అధిరోహించిన తరువాత వలస ఉద్యోగులు ముప్పుతిప్పలు పడ్డారు, అంతా సర్థుకుంటోందని భావిస్తోన్న క్రమంలో కరోనా మహమ్మారి యావత్ ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటడంతో మరోమారు అగ్రరాజ్యంలో వలసవాదుల ఉద్యోగుల ఉపాధి అంశం చర్చనీయాంశంగా మారింది, దీంతో హెచ్‌-1బీ వీసాలు కలిగిన వారునూ తమ ఉద్యోగాలను వదిలి వారివారి సోంత దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యేలా ట్రంప్ సర్కార్ చర్యలు తీసుకుంది.

అధ్యక్షుడి చర్యలపై దిగ్గజ కార్పోరేట్ సంస్థల నుంచి చిన్న చిన్న సంస్థల వరకు బహాటంగానే వ్యతిరేకత వచ్చింది. అంతేకాదు ఉద్యోగస్థులు నుంచి కూడా పెద్ద ఎత్తున్న నిరసనలు వచ్చాయి, దీంతో ట్రంప్ కాస్త వెనక్కు తగ్గినట్టు సమాచారం. తాజాగా హెచ్1-బీ వీసాలకు సంబంధించిన నిబంధనల్లో స్వల్ప సడలింపులు కూడా కల్పించడంతో వలసదారుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది, దానిలో భాగంగా వీసా నిషేధం కంటే ముందు చేసిన ఉద్యోగాల్లోకి తిరిగి వచ్చే హెచ్1-బీ వీసాదారులు అమెరికాలోకి ప్రవేశించడానికి అనుమతిస్తామని ఆ దేశ‌ ప్రభుత్వం వెల్లడించింది. వీసాదారులతో పాటు వారిపై ఆధారపడిన భాగస్వాములు, పిల్లలు కూడా వెంట రావచ్చని అమెరికా‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ స్టేట్ అడ్వైజరీ స్పష్టం చేసింది.

కరోనా వ్యాప్తి కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఈ వీసాలతో ఉన్న విదేశీ టెక్నిక‌ల్ స్పెష‌లిస్టులు, సీనియ‌ర్ లెవ‌ల్ మేనేజ‌ర్ల సేవలు ఎంతగానో అవ‌స‌రముందని అమెరికా పేర్కొంది. దీంతో హెచ్‌1బీ వీసాలు కలిగి ఉన్న సాంకేతిక నిపుణులు, ఉన్నత స్థాయి మేనేజర్లు, ఇతర విభాగాల్లో విధులు నిర్వర్తించే వారికి యూఎస్‌ అనుమతినిచ్చింది. ఈ నిర్ణయం అమెరికా తక్షణ, నిరంతర ఆర్థిక పునరుద్ధరణకు దోహదం చేస్తుందని పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా దేశంలో రికార్డు స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయిన తరుణంలో ట్రంప్‌ జూన్ 22న హెచ్-1బీ, ఎల్ 1 వీసాలతో వలసేతరులు ప్రవేశించడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ఈ వీసాల నిషేధంపై సడలింపులు ఇవ్వడంతో పలు దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles