Mahant Who Shared Stage With PM Modi Tests Positive రామ జన్మభూమిలో కరోనా కలకలం..

Ram temple trust head nritya gopal das tests positive for coronavirus

Ayodhya Ram temple, Ram Temple Priest Coronavirus Positive, Police Coronavirus Positive, ayodhya priest, Ayodhya ram mandir, coronavirus, ayodhya priest corona positive, ram temple event, up police, cops test corona positive, priest tests corona positive, PM Modi, CM Yogi Adithyanath, Uttar Pradesh

The head of the Ram Janmabhoomi Teertha Kshetra Trust or the Ram Temple trust in Ayodhya, who shared stage with Prime Minister Narendra Modi and several other VIPs during the groundbreaking ceremony for a Ram Temple last week, has tested positive for coronavirus.

ప్రధానితో భూమిపూజలో పాల్గొన్న రామాలయ ప్రధాన అర్భకుడికి కరోనా..

Posted: 08/13/2020 10:58 PM IST
Ram temple trust head nritya gopal das tests positive for coronavirus

రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ ముహూర్తానికి సరిగ్గా వారం రోజుల ముందు ఏ అంశమై అయోధ్య వార్తల్లో నిలిచింది.. సరిగ్గా అదే అంశమై వారం రోజుల తరువాత కూడా వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి ఏకంగా పెద్ద అలర్ట్ ఇచ్చింది. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ఈ నెల 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సారథి నృత్యగోపాల్ దాస్‌ అధ్యక్షత వహించిన విషయం కూడా తెలిసిందే. భూమి పూజ పర్యవేక్షణ పనులను చూసుకోవడంతో పాటు ఆయన ప్రధాని మోడీతో కలసి వేదికను కూడా పంచుకున్నారు. అయితే తాజాగా ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు.

రెండు రోజుల క్రితం జరిగిన కృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా నృత్యగోపాల్‌ దాస్ ప్రస్తుతంలో‌ మథురలో ఉంటున్నారు. ఆయనకు ఆకస్మికంగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్యులు కరోనాతో పాటు పలు పరీక్షలు చేశారు. దీంతో ఆయనకు కొవిడ్-19 సోకినట్లు‌ నిర్ధారణ అయింది. దీంతో అయోధ్యలో జరిగిన రామమందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గోన్న మహమహులందరినీ వైద్య అరోగ్యశాఖ అధికారులు అప్రమత్తం చేశారని సమాచారం. అయితే నృత్య‌గోపాల్ దాస్ మధుర వెళ్లిన నేపథ్యంలో అక్కడ కరోనా సోకిందా.? లేక ఎలా వ్యాప్తి చెందిందన్న విషయాన్ని కూడా అధికారులు తెలుసుకుంటున్నారు.

కాగా నృత్యగోపాల్ ధాస్ కు కరోనా సోకిన విషయాన్ని తెలుసుకున్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌ ఇప్పటికే మ‌థుర డీఎంతో మాట్లాడిన‌ట్లు ఆ రాష్ట్ర సీఎంవో కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. రామాలయ భూమిపూజ కార్యక్రమంలో ఆయనతో పాటు యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌తో పాటు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ సహా పలువురు వేదికపై కనపడ్డారు. కాగా, భూమిపూజకు ముందు కూడా ఆలయ పూజారి ప్రదీప్ దాస్ తో పాటు మరికొందరు పోలీసు సిబ్బందికి కరోనా సోకిన సంగతి విదితమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles