కరోనా మహమ్మారి జడలు విప్పి కళరా నృత్యం చేస్తున్న నేపథ్యంలో దాదాపు ఎనబై రోజుల తరువాత కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వారాలు తెరుచుకోవడంతో భక్తుల దర్శనానికి బారులు తీరుతున్నారు. రోజు రోజుకూ శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో తిరుమల తరుపతి దేవస్థానం కూడా అందుకు అనుగూణంగా నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం ద్వారాలు తెరచిన క్రమంలో కరోనా వైరస్ మహమ్మారి సోకకుండా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ రోజుకు కేవలం ఆరు వేల మందిని మాత్రమే దర్శనాలకు అనుమస్తామని టీటీడీ ప్రకటించింది. కాగా భక్తుల రద్దీ అధికం అవడంతో టీటీడీ క్రితం రోజున ఆన్ లైన్ లో ఏకంగా 18 వేల టికెట్లను విక్రయించింది.
ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరమేంటంటే ఆరు వేల నుంచి 12 వేలకు పెంచిన టికెట్లను మరోమారు పెంచి ఏకంగా 18 వేలను విక్రయించినా.. అవి కాస్తా కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే అయిపోయాయి. తిరుమలలో ఈ నెల 27న శ్రీవారి దర్శనానికి అఫ్ లైన్ లో సర్వదర్శనం టికెట్ల జారీ చేస్తున్నారు. ఈ టికెట్లకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఈ మేరకు ఉచితదర్శన టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించింది. స్వామివారిని దర్శించుకోవడానికి సర్వదర్శనం ఉచిత టోకెన్ల జారీ తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ప్రారంభమైంది. అయితే టికెట్లను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.
ఇందుకోసం ఏకంగా అర్ధరాత్రి 2 గంటల నుంచే భక్తులు టోకెన్ల కోసం బారులు తీరారు. రోజుకు 6750 మంది భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించాలని తితిదే నిర్ణయించినా భక్తులు మాత్రం శ్రీవారి దర్శనాభాగ్యం లభిస్తందో లేదోనని పోటెత్తారు. ఈమేరకు ఉచిత దర్శన టోకెన్ల జారీని తితిదే శుక్రవారం ఉదయం ప్రారంభించింది. తిరుపతిలోని విష్ణునివాసంలో 8 కౌంటర్లు, శ్రీనివాసంలో 6 కౌంటర్లు, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 18 కౌంటర్లలో 3 వేల ఉచిత దర్శన టోకెన్లను జారీ చేస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల నుంచే భక్తులు టోకెన్ల కోసం బారులు తీరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more