CBSE board exams to be out on July 15th జూలై 15న సీబీఎస్ఈ 10, 12 ఫలితాలు..

Cbse board exams to be out on july 15th improvement for 12th class

cbse, cbse board exams results, cbse board exam results, supreme court cbse board results, hrd ministry cbse board exams, parents cbse board exam results, cbse board exam, cbse exam scrapping, supreme court, supreme court on cbse board exam, cbse board exam, cbse 10th exams, cbse 12 exam,cbse results, icse results, cbse board exam, cbse 10th results, cbse 12 exam results, cbse board exam results, supreme court

Taking note of the COVID-19 pandemic, the Central Board of Secondary Education, CBSE has decided not to conduct the pending exams of class 10 and 12 scheduled from July 1. The board will announce the result on the basis of new marking scheme. Students who had appeared in the exams can expect their results by July 15, as mentioned in the board's notification.

జూలై 15న సీబీఎస్ఈ 10, 12 ఫలితాలు.. ఇప్రూవ్ మెంట్ పరీక్షలు త్వరలో..

Posted: 06/26/2020 07:36 PM IST
Cbse board exams to be out on july 15th improvement for 12th class

10, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు బోర్డు సభ్యులు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో విద్యార్థులకు మార్కులను ప్రకటించే పనిలో నిమగ్నమైంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్డు. ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా విద్యార్థులకు మార్కుల్ని వేయనుంది సీబీఎస్ఈ. మూడు పేపర్స్ అసెస్ మెంట్ ద్వారా ఈ మార్కులు ఉంటాయి. జూలై 15 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయనుంది సీబీఎస్ఈ. ఈ ఫలితాల ఆధారంగానే విద్యార్థులు పై తరగతులకు అడ్మిషన్లు పొందొచ్చు. 10వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే మార్కులను ప్రకటించనుంది బోర్డు.

అయితే 12వ తరగతి విద్యార్థులకు మాత్రం మార్కులు ప్రకటించిన తరువాత వాటిని మెరుగుపర్చుకునే అవకాశం కుడా కల్పించింది. ప్రస్తుతం విద్యార్థులకు ఇచ్చే మార్కులతో వారు సంతృప్తి చెందని పక్షంలో మరోమారు విద్యార్థులు ఇప్రూవ్ మెంట్ పరీక్షలు రాసుకునేలా అవకాశాన్ని కల్పించింది. ఈ ఆప్షన్ ఎంచుకునేందుకు విద్యార్థులకు సీబీఎస్ఈ కొన్ని రోజుల సమయం ఇస్తుంది. ప్రస్తుతం జూలై 15న పదో తరగతి, 12వ తరగతి పలితాలు వెల్లడైన తరువాత మరొికొన్ని రోజుల సమయం ఇచ్చిన తరువాత పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే పరీక్ష రాయాలనుకునే విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్షలను నిర్వహించనుంది సీబీఎస్ఈ. అయితే ఆ పరీక్షలు ఎప్పుడు ఉంటాయన్న విషయాన్ని తర్వాత వెల్లడిస్తుంది బోర్డు.

కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో 10, 12వ విద్యార్థుల తల్లిదండ్రుల పిటీషన్ నేపథ్యంలో స్పందించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశాల మేరకు సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసింది. జూలై 1 నుంచి 15 మధ్య ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు కూడా తేదీలను ఖరారు చేసింది. అయితే కరోనా విజృంభన నేపథ్యంలో తమ పిల్లలను పరీక్షలకు ఎలా పంపుతామని పలువురు తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షల్ని రద్దు చేయాలని, ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కులు వేయాలంటూ తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. దీంతో తల్లిదండ్రుల అవేదన, అందోళన నేపథ్యంలో అందుకు తగిన రీతిన స్పందించి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించిన క్రమంలో సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్ుల ప్రకటించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles