YSRCP show-cause notice has no legal sanctity: MP మీకు నోటీసులు పంపే అర్హత వుందా: రఘురామ కృష్ణంరాజు

Vijayasai reddy show cause notice has no legal sanctity raghurama krishnam raju

Show cause to Vijay Rama Raju, VijaySai Reddy, General Secretary, Raghu Rama Krishnam Raju, Raghu Rama Krishnam Raju news, Raghu Rama Krishnam Raju updates, Raghu Rama Krishnam Raju latest, Raghu Rama Krishnam Raju comments, Raghu Rama Krishnam Raju YCP notices, Raghu Rama Krishnam Raju new comments, Raghu Rama Krishnam Raju showcause notice, Raghu Rama Krishnam Raju, YSRCP, High Command, party posts, Narsapuram MP, Andhra Pradesh, Politics

Reacting sharply to the show-cause notice issued by YSRCP Rajya Sabha MP Vijayasai Reddy, Narsapuram MP Raghurama Krishnam Raju questioned the legal sanctity, as it was served under the letter head of the YSR Congress Party instead of the party name 'Yuvajana Sramika Rythu Congress Party' which is the registered name in the Election Commission of India.

విజయసాయి.. మీకు నోటీసులు పంపే అర్హత వుందా: రఘురామ కృష్ణంరాజు

Posted: 06/26/2020 05:30 PM IST
Vijayasai reddy show cause notice has no legal sanctity raghurama krishnam raju

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి చెందిన నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు సొంతపార్టీ వైసీపీపై దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ వ్యవహారం పార్టీలో కాకపుట్టిస్తుండగా, రఘురామ కృష్ణం రాజు దూకుడు కూడా తోడుకావడంతో ఇది ఎక్కడకు దారితీస్తుందో కూడా అర్థంకాని పరిస్థితి నెలకోంది. పార్టీ అధినాయకత్వంతో పాటు పార్టీలోని ఎమ్మెల్యేల అవినీతిపై కూడా మీడియా ముఖంగా వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయను పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసినా ఆయన ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేసిన వైసీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారు. అసలు తనకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అధికారం విజయసాయి రెడ్డికి ఉందా.? అని ఆయన ప్రశ్నించారు. 

ఇక వైసీపీ పార్టీలో.. పార్టీఅంతర్గత క్రమశిక్షణా కమిటీ వుందా.? అని ఆయన ప్రశ్నించారు. పార్టీలో అంతర్గత వ్యవహారాలను పర్యవేక్షించే కమిటీలు వున్నాయా.? అని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమశిక్షణ సంఘానికి భారత ఎన్నికల కమీషన్ గుర్తింపు వుందా.? అని కూడా ప్రశ్నించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో విజయసాయిరెడ్డి పంపిన షోకాజ్ నోటీసులకు చట్టబద్దత వుందా.? అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల కమీషన్ వద్ద రిజిస్టర్ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరున కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరిట షోకాజ్ నోటీసులు పంపడంపై ఆయన అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆయన తనకు షోకాజ్ నోటీసులు పంపిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఓ లేఖ రాశారు. తాను లేవనెత్తిన పలు సందేఃహాలను తీర్చాలని లేఖలో పేర్కోన్నారు. ‘ మీ లేఖకు ఇది బదులు మాత్రమే.. సంజాయిషీ కాదు’ అని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన కేంద్ర ఎన్నికల కమీషన్, హోంశాఖ అధికారులను కలిసే అవకాశముందని సమాచారం. ఇక ఇదివరకే ఆయన తన నియోజకవర్గ పర్యటన సందర్భంగా కేంద్ర బలగాల రక్షణ కల్పించాలని కూడా లోక్ సభ స్పీకర్ ను కోరడంతో ఆయన అదే రోజున దానిని హోంశాఖ కార్యదర్శికి పంపించారు.

రఘురామ కృష్ణంరాజు.. పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసులు పంపించారు. ఆంగ్ల మాధ్యమం విషయంలో పార్టీ మేనిఫెస్టోకు భిన్నంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఆయన ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు గుప్పించారని తెలిపారు. రఘురామకృష్ణం రాజు సొంత పార్టీని కించపర్చేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా సీఎం జగన్‌పై కూడా పలు వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలన్నింటికీ వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంటూ ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు వైసీపీ పేర్కొంది.

అయితే ఈ విషయాలపై పార్టీలో పార్టీపరంగా చర్చించాల్సిన అంశమని పేర్కొనాల్సిన అంశమని.. దీనిపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలోనే చర్చించాలని తాను భావించినా.. తనకు సమయాన్ని కేటాయించకపోవడంతోనే విషయంపై మీడియా ముఖ్యంగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇక ఇక్కడ ఆయనకు వ్యతిరేకంగా ప్రసాద రాజు సహా పలువురు ఎమ్మెల్యేలు కూడా మీడియా ముఖంగా ఎంపీపై పలు విమర్శలు చేశారు, అయితే వీరికి మాత్రం పార్టీ ఎలాంటి షోకాజ్ నోటీసులు జారీ చేయలేదు. ఒకరికి వర్తించిన సూత్రం.. తమ పక్షాన నిలిచినంత మాత్రమే ఇతరులకు వర్తించవా..? అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. మూడు పార్టీలు తిరిగినా సిటు ఇవ్వలేదని, చివరికి వైసీపీ టికెట్ ఇచ్చిందని అన్నారు. గతంలో నామినేషన్ వేసిన ఆయన ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పాలని నిలదీయడంపై రఘురామకృష్ణంరాజు కూడా ధీటుగా రియాక్ట్ అయ్యారు. సింహం సింగిల్ గానే వస్తుందంటూ తనపై విమర్శలు సంధించిన ఎమ్మెల్యేలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు.

తన ఫోటో పెట్టుకుని ఓట్ల అడగటం ద్వారానే నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారని ఆన్న ఆయన ఈ విమర్శలు మింగుడపడని పక్షంలో ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తే.. తాను తన పదవికి రాజీనామా చేసిన ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమని సవాల్ విసిరారు, తనను మాత్రమే ప్రజల మధ్యలోకి వెళ్లమని చెప్పే అధికారం ఏ ఒక్కరికీ లేదని, తనను ఎవరు విమర్శించినా.. వారికి ఇదే తన సవాల్ అని అన్నారు. తనలాగే ఎమ్మెల్యే గ్రంధీ శ్రీనివాస రావు కూడా ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ లభించిక నిరుత్సాహానికి గురయ్యారని ఎంపీ అన్నారు.

ఎమ్మెల్యే ప్రసాదరాజు హుందా గల వ్యక్తని అన్న ఆయన ప్రస్తుతం తనను విమర్శిస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణ ఓ ఇసుక దోంగ అంటూ ఆయనపై పలు అరోపణలు సంధించారు. ఇసుకను దొడ్డిదారిలో విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్నారని అరోపించారు. అంతేకాదు ఇళ్ల స్థలాల విషయంలోనూ ఆయన కోట్లు గడించారని ఆరోపించారు. సత్యనారాయణ అరచకాల గురించి తాను చెప్పడం కన్నా ఆయన మేనల్లుడే చెబుతాడని.. ఆయన అవినీతి చిట్టా చెంతాడంత వుందని విమర్శించారు. ఇక మరో ఎమ్మెల్యే నాగేశ్వరరావుపైనా ఎంపీ అనేక అవినీతి అరోపణలు చేశారు. ఇప్పటికే ఆయనపై పలు అరోపణలు వున్నాయని అన్నారు.

తాను ముఖ్యమంత్రి జగన్‌ ఇంటికి కూడా వెళ్లనని ఎన్నికలకు ముందే చెప్పానని.. దీంతోనే ఎన్నికలకు ముందు జగన్ తనను విమానాశ్రయంలో కలిశారని ఈ విషయాన్ని మర్చిపోయిన కొందరు నేతలు ఇప్పడు తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించిన ఆయన తన బొమ్మ పెట్టుకొని ఎన్నికల్లో నెగ్గిన ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ బొమ్మ పెట్టుకుని మరోమారు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపించాలని రఘు రామకృష్ణరాజు సవాల్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles