SC stays Telangana HC orders in covid tests after deaths తెలంగాణ సర్కార్ కు ఊరట.. హైకోర్టు అదేశాలపై సుప్రీం స్టే..

Covid 19 sc says centre should direct states to pay salaries to doctors

coronavirus pandemic, courts, covid-19, Doctors, healthcare workers, salaries, Union Government, State Governments, Quarantine facilities, Supreme Court

The Supreme Court on Wednesday asked the Centre to issue directions to states for payment of salaries and providing necessary quarantine facilities to doctors and healthcare workers engaged in treating COVID-19 patients. A bench of justices Ashok Bhushan, S K Kaul and M R Shah said that doctors and healthcare workers treating COVID-19 patients should not be denied quarantine facilities.

తెలంగాణ సర్కార్ కు ఊరట.. హైకోర్టు అదేశాలపై సుప్రీం స్టే..

Posted: 06/17/2020 03:47 PM IST
Covid 19 sc says centre should direct states to pay salaries to doctors

తెలంగాణలో కరోనా పరిక్షల నిర్వహణలో విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో.. తెలంగాణ సర్కార్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. ఇప్పటికే ప్రతిపక్షాల విమర్శతో  సతమతం అవుతున్న టీఆర్ఎస్ సర్కార్ కు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. తమ అదేశాలను పాటించని పక్షంలో కోర్టు ధిక్కారం కింద కేసులు నమోదు చేస్తామని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులో తెలంగాణ ప్రభుత్వానికి కాసింత ఊరట లభించింనట్లు అయ్యింది. సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఉత్వర్వులపై స్టే విధించింది.

కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో మరణించిన వారికీ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలన్న దిగువ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కరోనా పరీక్షల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేయడంతో సుప్రీంకోర్టు ఈ మేరకు ఉత్తర్వులనిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంలో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వ వాదనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం సర్కార్ వాదనలను పరిగణలోకి తీసుకుని ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. న్యాయస్థానంలో తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది.. హైకోర్టు ఆదేశించినట్లు అందరికీ కరోనా పరీక్షలు సాధ్యపడదని పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ నిబంధనల మేరకే కరోనా పరీక్షలు చేస్తున్నామని తెలిపింది. దీంతో ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

వైద్యులు, సిబ్బందికి వేతనాలపై కేంద్రానికి సుప్రీం అదేశం

కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన రోగులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి వేతనాల చెల్లింపుపై రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే వీరికి క్వారంటైన్ వసతులు కల్పించడంపై కూడా రాష్ట్రాలకు సూచనలు చేయాలని కోరింది. కోర్టు ఆదేశాల అమలుపై నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అమలుపై నిర్లక్ష్యం వహిస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. వైద్యులకు 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి కాదన్న కేంద్ర నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఓ వైద్యుడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని జస్టిస్ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్ ఎం.ఆర్‌.షా లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  Doctors  healthcare workers  

Other Articles