Petrol, diesel price hiked for 10th day today వరుసగా పదవరోజు వాహనదారుల జేబుకు చిల్లు..

Petrol diesel price hiked by more than 5 in 10 days

World, Coronavirus pandemic, WHO, coronavirus cases telangana, coronavirus vaccine, coronavirus cure, covid-19, coronavirus cases, corona vaccine, coronavirus deaths, coronavirus india, COVID-19, Gandhi Hospital, Hyderabad, Telangana, Doctors protest, Doctors attacked, Coronavirus, Coronavirus lockdown

For the 10th consecutive day today, the price of petrol went up by 47 paise a litre and that of diesel by 57 paise a litre. In these 10 days, petrol price has increased by ₹5.45 a litre and diesel price by ₹5.8 a litre (Delhi rates). Fuel prices are now at its highest level since more than a year.

వరుసగా పదవరోజు పెరిగిన ఇం‘ధరలు’.. ఏడాది గరిష్టానికి..

Posted: 06/16/2020 12:02 PM IST
Petrol diesel price hiked by more than 5 in 10 days

అంతర్జాతీయంగా ఇంధనాని డిమాండ్ పెరుగుతుండటంతో ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ టో గత నెలలో వున్న ఇరవూ డాలర్ల బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర రెట్టింపు ధర కన్నా అధికస్థాయికి చేరడంతో ప్రస్తుతం దేశంలో ఇంధన ధరలు ఏడాది గరిష్టస్థాయిని అందుకున్నాయి. ఇదే క్రమంలో వరుసగా పది రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులు జేబులకు చిల్లులు పెడుతుండగా, ఇంధనంపై ఏకంగా ఐదు రూపాయాల మేర పెరిగింది. ఇక దీనికి తోడు కేంద్రప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ పన్నులు, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే విలువ ఆధారిత సేవలు ఇంధన ధరలను అంతకంతకూ పెంచుతున్నాయి. ఇటు పెట్రోల్ తో పాటు ఆటు డీజీల్ ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలకు కూడా పెరుగుతున్నాయి.

దేశంలో లాక్ డౌన్ సమయంలో మారని ధరలు, ఆపై అన్ లాక్ 1.0 ప్రారంభమైన తరువాత, రోజూ పెరుగుతూ వస్తున్నాయి. ఏప్రిల్ నెలతో పోల్చితే గత నెలలో ఇంధన ధరల వినియోగం పెరిగిందని, గత నెలలో ఏకంగా రెట్టింపు వినియోగం అయ్యిందని దేశ అతిపెద్ద రిఫైనరీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో వరుసగా ఐదో రోజూ ధరలు పెరిగాయి. గురువారం నాడు లీటరుపై 60 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి. దీంతో గత పది రోజుల్లో పెట్రోలు ధర లీటరుకు ఐదు రూపాయల మేర పెరిగింది. పెట్రోల్ పై పది రోజుల్లో 5.45మేర, డీజిల్ పై రూ.5.8 మేర పెరిగినట్లయింది.

ఇక ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే, న్యూఢిల్లీలో పెట్రోలు  రూ. 76.73. డీజిల్   రూ. 75.19కు చేరగా, గుర్గావ్ లో పెట్రోల్ ధర 75.41 డీజిల్ 67.96, ముంబైలో పెట్రోల్  రూ. 83.62, డీజిల్  రూ. 73.75కు చేరాయి. ఇదే సమయంలో చెన్నైలో పెట్రోల్ రూ. 80.37. డీజిల్ రూ. 73.17కు పెరుగగా, బెంగళూరులో పెట్రోల్ రూ. 79.22. డీజిల్ రూ. 71.49కి, హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 79.65. డీజిల్ రూ. 73.49కు, అమరావతిలో పెట్రోల్  రూ. 77.36. డీజిల్ రూ. 71.18కు చేరుకున్నాయి. ఇక అటు గుజరాత్ లో మాత్రం ఇంధన ధరలు మరో రెండు రూపాయల మేర పెరిగాయి. కోవిడ్ నష్టాలను పూడ్చుకునేందుకు అక్కడి ప్రభుత్వం వ్యాట్ ను రెండు రూపాయల మేర పెంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  diesel  petrol price  diesel price  

Other Articles