9,996 new cases 357 deaths in 24 hours దేశంలో కరోనా మరణమృదంగం: పదివేలకు చేరువలో మరణాలు..

Covid 19 cases in india near 3 45 lakh death toll inches towards 10000

Coronavirus in india, coronavirus india news, coronavirus latest news, coronavirus news, coronavirus news today, coronavirus update, coronavirus, india, coronavirus cases in india, coronavirus deaths in india, health ministry, Maharashtra, Delhi

India witnessed another sharpest jump in coronavirus death toll as the states had recorded 380 fatalities in the last 24 hours. The causalities from the coronavirus pandemic rose to 9,900. Maharashtra reported a record number of deaths on Monday. The deadly novel virus claimed 178 lives in the western state in the last 24 hours.

దేశంలో కరోనా మరణమృదంగం: పదివేలకు చేరువలో మరణాలు..

Posted: 06/16/2020 11:43 AM IST
Covid 19 cases in india near 3 45 lakh death toll inches towards 10000

(Image source from: Newindianexpress.com)

దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. ఓ వైపు తన వ్యాప్తిని అంతకంతకూ పెంచుకుంటూ వెళ్తున్న క్రమంలోనే మరోవైపు దేశంలో మరణాలను కూడా పెంచేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ.. లక్షలాధి మందిని తన ప్రభావానికి గురిచేస్తూ.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి దేశంలోనూ తన ఉదృతిని శరవేగంగా విస్తరించుకుంటోంది. రోజురోజుకూ తన వ్యాప్తిని కూడా దేశ ప్రజలపై ఉదృతంగా కొనసాగిస్తోంది. ఫలితంగా కరోనా ప్రభావనపడిన దేశాల్లో నాల్గవ స్థానంలో భారత్ నిలిచింది. కాగా మరణాల సంఖ్య ఏకంగా పదివేలకు చేరువ కావడంతో ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో ఎనమిదవ దేశంగా నిలిచింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో కరోనా విలయతాండవం చేయడం నిపుణుల అంచనాలు నిజం కానున్నాయా.? అన్న అందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది.

గత వారం రోజులుగా కరోనా కేసులు వ్యాప్తి ఉదృతంగా కోనసాగుతోంది. వారం ప్రారంభంలో ఎనమిది వేలకు పైబడిన సంఖ్యలో కరోనా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం పది వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో క్రమంగా కరోనా వైరస్ మహమ్మారి బారిన బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఏకంగా లక్షకుపైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయాందోళనకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇక దీనికి తోడు మరణాలు కూడా మృదంగాన్ని మ్రోగిస్తున్నాయి. ప్రతీ రోజు రెండు వందలకు పైబడిన సంఖ్యలో మరణాలు నమోదు అయ్యే మరణాలు గడిచిన 24 గంటల్లో ఏకంగా అత్యధిక సంఖ్యలో మునుపెన్నడూ లేని విధంగా 380 మరణాలు సంభవించాయి, మహారాష్ట్రలోనే ఏకంగా 178 మరణాలు నమోదు కావడం దేశప్రజలను అందోళనకు గురిచేస్తోంది.

దేశంలో అన్ లాక్ 1.0 అమల్లోకి రావడంతో స్థంభించిన జనజీవనానికి చలనం వచ్చింది. కేవలం మాల్స్, బార్లు, ధియేటర్లు, స్టేడియాల్లో ఆటలు ఇలా భారీ సంఖ్యలో జనసమూహం వున్న ప్రాంతాల్లో కార్యకలాపాలు మినహాయించి మిగిలిన అన్ని వ్యవహారాల తలుపులు తెరుచుకున్నాయి, దీంతో కరోనా కేసులు వ్యాప్తి కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 10,667 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 343,091 కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో 380 మంది మరణించడం అందోళన కలిగించే విషయం. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య పది వేల మార్కును దాటాయి. తాజాగా నమోదైన గణంకాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 9900కి మరణాలు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.

దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యదికంగా నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల వ్యవధిలో మహారాష్ట్రంలో 178 మరణాలు సంభవించాయి. ఆ తరువాత కరోనా విజృంభన ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోనూ అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో గత 24 గంటల వ్యవధిలో పలువురు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 1,80.013 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 1,53,178 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. అయితే తొలిసారిగా కరోనా చికిత్స పోందుతున్న వారి కన్నా.. మహమ్మారి బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి.

కరోనా బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో యాభై శాతానికి పైగా చేరిందని.. ఇది అత్యధికమని ఐఎంసీఆర్ గణంకాలు స్పష్టంచేస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మహారాష్ట్రలో ఏకంగా లక్ష కేసులు దాటిన కరోనా కేసులు ఇవాళ ఏకంగా లక్ష పది వేల మార్కును అందుకున్నాయి, తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 2786కరోనా కేసులు నమోదుకాగా, 178 మరణాలు సంభవించాయి, దీంతో మహారాష్ట్రలో మరణాలు కూడా ఏకంగా 4128కి చేరాయి, దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనే అధికంగా పాజిటివ్ కేసులు నమోదు అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది, ముంబై నగరం చైనాలోని వూహాన్ నగరాన్ని మించిన కేసులతో అందోళనకరంగా మారింది. దేశంలో నమోదైన కేసుల్లో దాదాపు 38శాతం కరోనా కేసులు మహరాష్ట్ర నుంచి నమోదు కావడం.. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 94,041కు చేరగా, ఏకంగా 3438మరణాలు నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles