Bizarre: Delhi man hire killers for his own murder తన హత్యకు తానే సుపారీ.. భార్యాపిల్లల క్షేమం కోరి..

Delhi businessman got himself murdered for insurance money

Delhi businessman, Delhi Crime, Delhi, Insurance, Insurance money, Delhi murder, Ranhaula, IT Extension, Credit card fraud, phone call records, credit card fraud, businessman, hired killers, murder, insurance money, depression, minor boy, ranhaula, delhi police, crime

A Delhi businessman hired four people, including a minor, for his own murder to get insurance money for his family, police said on Monday. The man's body was found hanging from a tree - hands tied - in an outer Delhi area on June 10, they added.

తన హత్యకు తానే సుపారీ.. భార్యాపిల్లల క్షేమం కోరి..

Posted: 06/15/2020 11:54 PM IST
Delhi businessman got himself murdered for insurance money

ఆర్థిక ఇబ్బందులతో మానసిక వేదనకు గురై.. ఒత్తిడి నుంచి అధిగమించడానికి చికిత్స చేయించుకున్నా.. అతడిని ఆర్థిక ఇబ్బంధులు చుట్టుముట్టి మట్టుబెట్టాయి, తన జీవితంలో ఇక మార్పు రాదు.. వెలుగన్నదే లేదు అని భావించిన అతను.. కనీసం తన భార్యబిడ్డలైనా ఏ బాద, ఎలాంటి ఒత్తిడి లేకుండా చక్కగా జీవిస్తారని భావించి వారి క్షేమం కోరి.. తన ప్రాణలను తీయమని తనకు తానుగా కిరాయి హంతకులకు డబ్బు పంపి.. అతని ఫోటోను కూడా పంపాడు. ఈ విషయం వెలుగుచూడటంతో అతడుంటే కలో, గంజో కలసి తాగేవారమని, ఇప్పడు తనకు, తన పిల్లలకు దిక్కు ఎవరని ఆయన భార్య విలపించడం స్థానికుల చేత కూడా కంటతడి పట్టించింది.

నారు పోసినవాడే నీరు పోస్తాడని ఎదురుచూసినా.. తన జీవితంలో చీకటే తప్ప వెలుగు లేదని.. అప్పులు, అవమానాలు, మోసాలే తప్ప.. ఆర్థిక ప్రగతి లేదని తీవ్ర మానసిక వేదనకు గురైన ఓ వ్యాపారి జీవితం ఇది. కనీసం తాను మరణిస్తే.. తన భార్యా పిల్లలకు భీమా డబ్బులు వస్తాయని, దీంతో వారికైనా కష్టాలు తప్పుతాయని భావించాడు. కానీ తాను ఒకటి తలిస్తే భగవంతుడు మరోకటి చేస్తాడన్న విషయం తెలియక.. మరణించినా అతని చివరి కోరిక మాత్రం తీరలేదు. దీంతో ఎవరికోసమైతే అర్థంతరంగా జీవితాన్ని ముగించాడో వారు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోనున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఐపీ ఎక్స్ టెన్షన్ ప్రాంతానికి చెందిన కిరాణా దుకాణం యజమాని గౌరవ్‌ (37) కనిపించడం లేదని ఆయన భార్య షానూ భన్సాల్‌ ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉదయం దుకాణానని వెళ్లిన భర్త రాత్రైనా ఇంటికి రాలేదని.. తనకు అందోళనగా వుందని పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఢిల్లీలో శివార్లలో రన్హౌలా ప్రాంతంలో ఓ మృతదేహం వుందన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గౌరవ్ బంధువుల ద్వారా ఆ మృతదేహం గౌరవ్ దేనని నిర్థారించుకున్నారు.

గౌరవ్ కు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవని విచారణలో తెలుసుకున్న పోలీసులు అతని ఫోన్ కాల్ డేటా ఆధారంగా మర్డర్ కేసును విచారించడం ప్రారంభించారు. అతని కాల్ డేలాలో వున్న ఓ మైనర్ బాలుడ్ని పోలీసులు వెతికి పట్టుకున్నారు. అతడ్ని విచారించారు. అతడు చెప్పే సమాధానాలతో విస్తుపోయిన పోలీసులు అతని కాల్ డేటాను కూడా పరిశీలించారు. గౌరవ్ తన హత్యకు తానే సుపారీ ఇచ్చాడని మైనర్ బాలుడి వాంగ్మూలం తీసుకున్నారు. అతనితో్ పాటు హత్యకు సహకరించిన మిగిలిన ముగ్గురు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినా ఇదే సమాధానం వ్యక్తమౌంది.

అయితే గౌరవ్ ఎందుకిలా చేశాడు.. అతని ఉద్దేశ్యం ఏమిటీ అన్న దిశగా పోలీసుల విచారణ సాగింది. దీంతో అసలు కథ తెలిసింది. చిరువ్యాపారి అయిన గౌరవ్.. ఫిబ్రవరిలో రూ.6 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుని డిప్రెషన్ కు చికిత్స కోసం వినియోగించాడు. ఆ తరువాత క్రెడిట్ కార్డు మోసాల్లో రూ.3.5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇక దీనికి తోడు కరో్నా మహమ్మారి రాజ్యమేలడంతో లాక్ డౌన్ అమల్లోకి వచ్చి వ్యాపారులను కోలుకోని దెబ్బ కోట్టింది. దీంతో గౌరవ్ ను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దాంతో తాను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుతో కుటుంబం అయినా హాయిగా బతుకుతుందని భావించాడు.

అనుకున్నదే తడవుగా ఓ మైనర్ బాలుడ్ని ఫోన్ ద్వారా సంప్రందించి తన హత్యకు తానే సుపారీ మాట్లాడుకున్నాడు. అంతేకాదు, తన ఫొటోను కూడా ఆ మైనర్ కు పంపించాడు. ఫొటోలో ఉన్న వ్యక్తి ఫలానా ప్రదేశానికి వస్తాడని చెప్పి, అక్కడికి తానే వెళ్లాడు. ఆ కుర్రాడు మరో ముగ్గురి సాయంతో గౌరవ్ బన్సాల్ ను చంపి చెట్టుకు వేలాడదీశాడు. పోలీసుల విచారణతో తీగలాగితే మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకేసులో ప్రధాన నిందిడైన మైనర్ బాలుడితో పాటు అతనికి సహకరించిన ముగ్గురు ముఠా సభ్యులు మనోజ్‌కుమార్‌, సూరజ్‌, సుమిత్‌ కుమార్ లను పోలీసులు అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles