India reaches 3 lakh Covid-19 cases దేశంలో 3లక్షలకు చేరిన కరోనా కేసులు.. 8500 మరణాలు

Coronavirus update covid 19 cases in india reaches 3 lakhs with 11000 cases in a day

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

India reported 10,956 new coronavirus cases and 396 deaths in 24 hours on Friday morning. This is the highest single-day increase so far. With this, the tally rose to 2,97,535 cases and the toll from the disease stood at 8,498. India is now the fourth most-affected country in the world as it has overtaken the United Kingdom, which has 2.92 lakh cases.

కరోనా కరాళనృత్యం: 3లక్షలకు చేరిన కరోనా కేసులు.. 8500 మరణాలు

Posted: 06/12/2020 01:06 PM IST
Coronavirus update covid 19 cases in india reaches 3 lakhs with 11000 cases in a day

దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. పలు సడలింపులతో దేశంలో అమల్లోకి వచ్చిన తొలి అన్ లాక్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి దేశంలో కరోనా వ్యాప్తి ఒక్కసారిగా ఐదు వేల నుంచి ఎనమిది వేలకు ఎగబాకింది. ఆ తరువాత గత వారం రోజులుగా ప్రతీరోజు పదివేలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతుండగా ఇవాళ దానిని కూడా అధిగమించిన స్థాయిలో పాజిటివ్ కేసులు దేశంలో నమోదయ్యాయి, గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో నమోదైన కేసులతో భారత్ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద ప్రభావిత దేశంగా నిలించింది. ఈ క్రమంలో రెండు లక్షల 96 వేల కేసులతో నాల్గవ స్థానంలో వున్న యైనైటెడ్ కింగ్ డమ్ ను భారత్ అధిగమించింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెలువరించిన వివరాల మేరకు దేశంలో మునుపెన్నడూ నమోదుకాని సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదయ్యాయి, గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 10,965 సాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,97 వేలు రమారమి మూడు లక్షల మార్కుకు చేరింది. గత వారం రోజులుగా ప్రతీరోజు పది వేల కేసులు నమోదు అవుతుండటం దేశప్రజలను అందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 2,97 వేల 535 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 8498కు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 396 మరణాలు సంభవించాయి.

దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, న్యూఢిల్లీలలో కరోనా ప్రభావం తీవ్రంగా వుంది. ఇక్కడ నుంచే రమారమి తాజా కేసులన్నీ నమోదు కావడం అందోళనకు గురిచేస్తోంది. అటు మరణాలలోనూ మహారాష్ట్ర అధికంగా నమోదుచేసుకుంటోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మహరాష్ట్రలో 152 మరణాలు నమోదు చేసుకున్నాయి. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో మరణాలు మహారాష్ట్రలో నమోదు కాలేదు. దీంతో వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 147,195 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 141,842 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య.. చికిత్స పోందుతున్న రోగుల సంఖ్య కన్నా పెరగడం కాస్త ఊరటనిస్తోంది.

కాగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. గత పన్నెండు రోజుల వ్యవధిలో దేశంలో ఏకంగా లక్ష కేసులు నమోదయ్యాయి. సరిగ్గా మే 18న లక్ష కేసులను నమోదైన దేశంలో కేవలం 24 రోజుల వ్యవధిలోనే మరో రెండు లక్షల కేసులను నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థమవుతోంది. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ రాష్ట్రంలో కరోనా కేసులు ఏకంగా 24వేల మార్కును దాటాయి. నిన్న ఒక్కరోజే 3607 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఏకంగా 152 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 97,648 కేసులు నమోదు కాగా, మొత్తంగా మూడున్నర వేల మంది అసువులుబాసారు. మహారాష్టలో నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ అర్థిక రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles