Drunkard inserts glass bottle into body through anus తాగుబోతు వేషాలు: మందుబాటిల్ ను అక్కడ దాచిపెట్టాడు..

Glass alcohol bottle surgically removed from mans anal cavity

nagapattinam, surgery, drunk, liquor bottle, alcohol bottle, Dr. Pandiyaraj, Spinal anaesthesia, District Hospital, Tamil nadu, weird news

In a bizarre case, an alcohol bottle was surgically removed from the rectum of a man hailing from Nagore here on Friday. The man, supposedly in an inebriated state, had inserted an empty bottle into his anal cavity and was unable to remove it, hospital sources said.

తాగుబోతు వేషాలు: మందుబాటిల్ ను అక్కడ దాచిపెట్టాడు..

Posted: 06/01/2020 11:08 PM IST
Glass alcohol bottle surgically removed from mans anal cavity

పీకల వరకు మద్యం సేవించిన ఓ మందుబాబు చేసిన వ్యవహారంతో తన కెరీర్ లో మునుపెన్నడూ చూడని ఓ సరికొత్త కేసును వైద్యులు చూసి షాక్ అయ్యారు. తన తాగుబోతు వేశాలతో..  ఔరా.. అని వైద్యులను కూడా నోరెళ్లబెట్టేట్లు చేశాడో మందుబాబు. అసలేం జరిగిందంటే తమిళనాడులోని నాగపట్టణం ప్రభుత్వాసుపత్రికి ఈ నెల 27న ఓ మందుబాబు వచ్చాడు. కడుపులో నొప్పిగా ఉందని డాక్టర్లకు చెప్పాడు. దీంతో అతనికి పరీక్షలు చేయించిన డాక్టర్లు.. అతని ఎక్స్ రే చూసి షాక్ కు గురయ్యారు. ఇదెలా సాధ్యం.. మనిషి కడుపులో ఏకంగా క్వార్టర్ గాజుసీసా ఎలా వెళ్లిందని అవ్వకయ్యారు.

దీంతో 29 ఏళ్ల బాధితుడి వద్దకు చేరుకుని అసలు నీ కడుపులోకి నోప్పి ఎప్పట్నించీ అంటూ ఆరా తీశారు. నీ కడుపులోకి 180 మి.లీ. మందు సీసా వుంది. అదెలా వెళ్లిందని ప్రశ్నించారు. దీంతో బాధితుడు తనకు జరిగిన విషయాన్ని డాక్లర్ల ముందు బయటపెట్టాడు. 27వ తేదీన పీకల వరకు మధ్యం తాగాని వ్యక్తి.. తన తనతో పాటు ఇంటికి కూడా ఓ మద్యం సీసాను తీసుకుని వెళ్లాడు. అది చూస్తే ఇంట్లో వాళ్లు దానిని దాచేస్తారనో.. లేక పగలగొడతారనో భావించిన మందుబాబు.. దానిని ఎక్కడ స్థలం లేనట్టుగా.. తన పురీషనాళంలో దాచేశాడు.

అది కొద్దికొద్దిగా లోపలికి వెళ్లింది. ఇంట్లోకి చేరుకున్న తరువాత బహిర్భూమికని టాయ్ లెట్ లోకి వెళ్లిన ఆయన.. దానిని తీసేందుకు ప్రయత్నించాడు. అయితే అది కొద్దికొద్దిగా లోపలికి వెళ్లింది. మద్యం సీసాను బయటకు తీసే తన ప్రయత్నాలన్ని విఫలం కావడంతో ఇంట్లో వారికి కూడా చెప్పలేదు. ఇక స్నేహితులకు చెప్పినా తనను హేళన చేస్తారని భావించి నేరుగా నాగపట్టణం జిల్లా అసుపత్రికి వచ్చాడు. వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించిన అనంతరం బాధితుడికి మత్తమందు ఇచ్చి.. సర్జరీ చేసి మద్యం బాటిల్ ను బయటకు తీశారు.

అయితే ఈ క్రమంలో లేదా రోగి ప్రయత్నించే సమయంలో సీసా పగిలివుంటే చాలా ప్రయాసతో కూడిన శస్త్రచికిత్స అవసరమయ్యేదని డాక్టర్లు తెలపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి జనరల్ సర్జన్ పాండియరాజ్ మాట్లాడుతూ, ఎక్స్ రే చూసి షాకయ్యామని చెప్పారు. తన కెరీర్ లో ఇలాంటి కేసును ఎప్పుడూ చూడలేదని అన్నారు. పొరపాటున సీసా పగిలి ఉంటే అతని ప్రాణాలకే ముప్పు వాటిల్లి ఉండేదని చెప్పారు. ప్రస్తుతం రోగి కొంత బాధతో వున్నాడని, అయితే అతని అరోగ్యం నిలకడగానే వుందని, త్వరలో కోలుకుంటాడని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagapattinam  surgery  drunk  liquor bottle  

Other Articles