LPG cylinder price hiked today ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయహో.!

Lpg cylinder prices hiked after 3 consecutive cuts

LPG cylinder prices hiked, LPG cylinder prices, LPG cylinder, LPG gas prices, Gas cylinder price hike, lpg cylinder,lpg cylinder price,lpg cylinder rate,lpg gas cylinder,lpg gas cylinder latest price

After three months of consecutive rate cuts, the price of liquified petroleum gas (LPG) cylinders was increased today. 'For the month of June, 2020, there has been an increase in international prices of LPG.

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయహో.!

Posted: 06/01/2020 11:13 PM IST
Lpg cylinder prices hiked after 3 consecutive cuts

కరోనావైరస్ కారణంగా ప్రస్తుతం దేశం మొత్తం కష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో వంట‌గ్యాస్ ఉప‌యోగిస్తున్న వారికి గ్యాస్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. తాజాగా గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర పెరిగింది. మహమ్మారి కారణంగా మార్చి నెల నుంచి ప్రారంభమైన కరోనా భయంతో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆర్డర్లు బుక్ చేయడానికి కూడా సాహసించలేదు. అయితే ఇక దేశంలో విధించిన లాక్ డౌన్ తో హోటళ్లు రెస్టారెంట్లు అన్ని మూతపడ్డాయి. ఇక తాజాగా లాక్ డౌన్ 5.0 అమల్లోకి రావడం.. అందునా సడలింపులను తీసుకురావడంతో ఆతిథ్యరంగం కూడా పుంజుకోనుంది.

హోటళ్లు, రెస్టారెంట్లు కూడా తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో తెరుచుకో్నున్న అతిద్యరంగంపై అప్పుడే భారం పడింది. అసలే లాక్ డౌన్ తో సతమతమైన హోటళ్లు, రెస్టారెంట్లు ఇక సరిగ్గా తెరుచుకునే సమయం చూసి గ్యాస్ కంపెనీలు వారిపై భారాన్ని మోపాయి. ఈ రంగానికి ప్రాణప్రధమైన గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. సిలిండర్ ధర పెంపును పరిశీలిస్తే.. 14.2 కేజీల నాన్ సబ్సీడీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ ధరపై అదనంగా రూ.11.5 పెరిగింది.

దీంతో సిలిండర్ ధర రూ.593కి చేరింది. అలాగే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరపై రూ.110 పెరిగింది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1139కి ఎగసింది. గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా మారుతూ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లోని క్రూడ్ ధరలు సహా రూపాయి మారక విలువపై ఆధారపడి గ్యాస్ సిలిండర్ ధర మారుతూ ఉంటుంది. ఈ పెంపు ప్రధానమంత్రి ఉజ్వల (PMUY) స్కీమ్ లబ్దిదారులకు వర్తించదని ఇండేన్ గ్యాస్ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం పెంపుతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.593కు చేరింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్దిదారులపై పెంచిన రేటు ప్రభావం ఉండదని తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles