janasena reacts on HC judgement on SEC ఏపీ హైకోర్టు తీర్పును స్వాగతించిన పవన్ కల్యాణ్

Pawan kalyan reacts on hc judgement for nimmagadda ramesh kumar

AP High Court, JanaSena, Pawan Kalyan, Nagababu, Buchaiah chowdary, Nimmagadda Ramesh Kumar, State Election Commissioner, Revoked, AP GO Thrashed by High court, IAS officers, Retd Judges, YS Jagan, Kanagarajan, Andhra Pradesh, Politics

Janasena chief Pawan Kalyan has welcomed the decision of the High Court. Actor turned politician said the High Court abolishing the state-issued ordinance dismissing the state election commissioner is a big breather for the existence of the democracy in the state.

ITEMVIDEOS: నిమ్మగడ్డ వ్వవహారంలో ఏపీ హైకోర్టు తీర్పును స్వాగతించిన పవన్ కల్యాణ్

Posted: 05/29/2020 06:24 PM IST
Pawan kalyan reacts on hc judgement for nimmagadda ramesh kumar

రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహరాంలో రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన తరుణంోల ఆయన మళ్లీ బాధ్యతలు తీసుకోనున్నారు, ఇందుకు ప్రభుత్వం కూడా రెడ్ కార్పెట్ పరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపిన నిమ్మగడ్డ..  కోర్టు తీర్పు వెలువరించిన కొద్దిసేపట్లోనే తాను తిరిగి విధుల్లోకి చేరుతున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించారు. హైకోర్టు తీర్పుతోనే తాను విధుల్లోకి చేరుతున్నానని అన్నారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తానని ఆయన అన్నారు. దీంతో ప్రస్తుత ఎస్ఈసీ గా బాద్యతలు నిర్వహిస్తున్న మాజీ న్యాయమూర్తి కనగరాజ్ రాజీనామా చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు న్యాయపోరాటంపై సానుకూల తీర్పు రావడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో ఇలా పేర్కొన్నారు. ‘ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ,ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింద‘ని అన్నారు, ‘అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది’ అని జనసేనాని వ్యాఖ్యానించారు.

ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నాగబాబు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు స్పందిస్తూ హైకోర్టు ప్రజల్లో నమ్మకాన్ని నింపిందని అంటున్నారు. వైసీపీ సర్కారు ఇకనైనా తన తీరును మార్చుకోవాలని సూచిస్తున్నారు. హైకోర్టు తీర్పుపై జనసేన నేత, సినీనటుడు నాగబాబు స్పందిస్తూ.. 'భారత న్యాయ వ్యవస్థకు హ్యాట్సాఫ్.. న్యాయవ్యవస్థ ప్రజల్లో విశ్వాసం నింపింది. అన్యాయంపై పోరాడే బలాన్ని ఇచ్చింది' అని ట్వీట్ చేశారు.

ఎస్ఈసీపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్‌ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదన్నారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. హైకోర్టు రాజ్యాంగ విలువలను కాపాడిందన్నారు. కోర్టు తీర్పులను ప్రభుత్వం గౌరవించాలన్నారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లదని భావిస్తున్నామని బుచ్చయ్య చౌదరి తెలిపారు. కాగా ఆంధ్రప్రధేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుపై వైఎస్ జగన్ సర్కార్ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సవాల్ చేయనుందని సమాచారం. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles