Leopard caught in Hyderabad AU CCTV footage సీసీటీవీలో చిక్కన చిరుత.. ఈసారైనా పట్టుకునేనా..?

Leopard caught in hyderabad agriculture university cctv footage

Leopard, Himayath Sagar, Mylardevpally, Reservoir, GVK Gardens, Swiming Pool, Aziz nagar, moinabad, Rajendra nagar, Prof JayaShanker Agriculture University, cctv footage, RangaReddy, Telangana, Crime

Tension gripped among forest officials, police and locals after elusive leopard caught on CCTV cameras in Prof Jaya Shankar University campus. According to the sources, a CCTV footage is going viral on social media in a leopard wandering on the premises of the university campus.

ITEMVIDEOS: సీసీటీవీలో చిక్కన చిరుత.. ఈసారైనా పట్టుకునేనా..?

Posted: 05/29/2020 06:30 PM IST
Leopard caught in hyderabad agriculture university cctv footage

నడిరోడ్డుపై రెస్ట్ తీసుకుని స్థానికులను హడలెత్తించిన చిరుత.. అటవీ అధికారులకు చిక్కకుండా తప్పించుకుంటూ.. స్థానికులను హడలెత్తిస్తోంది. పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా దానిని పట్టుకునేందుకు ఎన్ని చర్యలు చేపడుతున్నా వాటిని అధిగమిస్తూ గత కొన్ని రోజులుగా చిరుత చిక్కకుండా పారిపోతోంది. మైలార్ దేవ్ పల్లిలో రోడ్డుపై పడుకుని ఆ తరువాత తప్పించుకుని హిమాయత్ సాగర్ రిజర్వాయర్ లో నీళ్లు తాగుతూ కనిపించడంతో అటవీశాఖ అధికారులు దానిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అయినా తెలివిగా వ్యవహరించిన చిరుత తప్పించుకుంది.

ఆ తరువాత చిరుత అచూకీ హిమాయత్ సాగర్‌ ఒడ్డున ఉన్న జీవీకే గార్డెన్స్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లో నీళ్లు తాగుతూ కనిపించింది. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి.. చిరుత పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అయినా చిరుత తప్పించుకుంది. ఇక అప్పటి నుంచి చిరుత అచూకీ కోసం అటవీశాఖ అధికారులు నిఘా పెట్టినా ప్రయోజనం నిష్పలంగా మారింది. ఇక తాజాగా రాజేంద్రనగర్ లోని ఫ్రోఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సీటీలో ఏర్పాటు చేసిన సిసిటీవీ ఫూటేజీలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు నిక్షిప్తం అయ్యాయి. దీంతో స్థానికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles