TSRTC to run buses with 50 pc occupancy పయనానికి సిద్దమైన ప్రగతి చక్రం.. తెలంగాణ క్యాబినెట్ భేటీలో నిర్ణయం

Tsrtc to reduce seating capacity of buses post lockdown

TSRTC, Coronavirus, Covid-19, Lockdown 4.0, TS Govt Officials, Bus services, CM KCR, Cabinet meet, RTC Officials, Telangana

Amid speculations that the State Cabinet is likely to take a decision on resuming TSRTC services during its meeting scheduled for May 19, the district RTC officials are busy making arrangements to immediately restart the services if the government gives a green signal.

పయనానికి సిద్దమైన ప్రగతి చక్రం.. తెలంగాణ క్యాబినెట్ భేటీలో నిర్ణయం

Posted: 05/18/2020 01:28 PM IST
Tsrtc to reduce seating capacity of buses post lockdown

కరోనా వైరస్ మహమ్మారి విజృంభనను నియంత్రించేందుకు దివ్యౌషధంగా భావించిన కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విదించింది. దీంతో కఠినంగా పలు నియమనిబంధనలు అమలు చేసింది. ప్రజారవాణాను నిలిపివేసింది. మార్చి 23వ తేదీ నుంచి రైళ్లు, విమానాలు, నౌకాయానాలతో పాటు బస్పు ప్రయాణాలు కూడా స్థంభింపచేసింది. దీంతో జనజీవనం పూర్తిగా స్థంభించింది. ఇలా ఏకంగా మూడు లాక్ డౌన్లు పూర్తి చేసుకుని నాలుగో లాక్ డౌన్లోకి ప్రవేశిస్తున్న తరుణంలో కేంద్రం ఇచ్చిన పలు సడలింపులతో ఇళ్లకే పరిమితమైన తెలంగాణ ప్రజలు కాసింత ఊరటపొందుతున్నారు.

ఇక రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులను నడిపేందుకు కూడా కేంద్రం పలు సడలింపులను ఇచ్చింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారం కూడా కట్టబెట్టింది. దీంతో తెలంగాణలోనూ ఆర్టీసీ బస్సులను నడిపేందుకు టీఎస్ ఆర్టీసీ అధికారులు రంగం సిద్దం చేశారు. అయితే ప్రభుత్వం నుంచి పచ్చజెండా కోసం వేచిచూస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. బస్సు సేవలను పునరుద్ధరించడంతోపాటు లాక్ డౌన్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

రేపటి నుంచి బస్సులు నడపాలని నిర్ణయించిన ప్రభుత్వం నిన్న రాత్రే ఈ విషయాన్ని ఆర్టీసీకి సమాచారం అందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ అధ్యక్షతన ఆర్టీసీ ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఇందులో బస్సుల నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసి, సాయంత్రం కేసీఆర్ సారథ్యంలో జరగనున్న సమావేశంలో నివేదించనున్నారు. అయితే బస్సు ప్రయాణాల్లోనూ ప్రజలు సామాజిక దూరం పాటించాల్సిన అవసరం వుందని అలాంటి చర్యలకు అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం అదేశించింది.

నిజానికి 50 శాతం బస్సులు నడిపేందుకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. కరోనా వ్యాప్తి భయంతో ఆర్టీసీ ముందుకు రాలేదు. ఇప్పుడు గ్రీన్, ఆరెంజ్ జోన్ల సంఖ్య  పెరుగుతున్న నేపథ్యంలో బస్సులు నడపాలని నిర్ణయించింది. కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాలకు అంటే గ్రామాలు, జిల్లాలు, రాష్ట్ర రాజధానికి బస్సులు నడవనున్నాయి. అయితే, ప్రయాణికులను పరిమితంగానే అనుమతించడం, వ్యక్తిగత దూరం పాటించడం వంటి చర్యలు తీసుకోనున్నారు. అయితే, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఇక అర్టీసీ బస్సులల్లో కేవలం యాభై శాతం కెపాసిటీతో నడపాలని నిర్ణయించిన ఆర్టీసీ.. ఇలా ప్రయాణించే ప్రయాణికులపై ఆ మేరకు ప్రయాణ టికెట్ భారం కూడా పడనుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles