Telangana begins to work during lockdown 4.0 amid restrictions ఆంక్షల మధ్య తెరుచుకున్న తెలంగాణ.. బతుకుబండి ఆన్..!

Telangana begins to work during lockdown 4 0 amid restrictions

TSRTC, Coronavirus, Covid-19, Lockdown 4.0, TS Govt Officials, Bus services, CM KCR, Cabinet meet, RTC Officials, Telangana

After the announcement of Cheif Minister KCR, Telangana begins to work during lockdown 4.0 amid restrictions

ఆంక్షల మధ్య తెరుచుకున్న తెలంగాణ.. బతుకుబండి ఆన్..!

Posted: 05/19/2020 10:05 AM IST
Telangana begins to work during lockdown 4 0 amid restrictions

కరోనా వైరస్ మహమ్మారి విజృంభనను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ను నాల్గవ విడతలో పలు సడలింపులతో అమల్లోకి తీసుకురావడంతో హైదరాబాద్ నగరం మినహా రాష్ట్రమంతా పలు మినహాయింపులతో లాక్ డౌన్ పూర్వపు పరిస్థితికి చేరుకుంది. రాష్ట్రంలో ఈ నెల 29 వరకు వున్న లాక్ డౌన్ ను ఈ నెలాఖరు 31 వరకు పొడగిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి పూట కర్ప్యూ కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజల బతుకులు బందు పెట్టి లాక్ డౌన్ ను అమలు చేయలేమని సీఎం కేసీఆర్ చెప్పారు.

అయితే అన్ని మతప్రార్థనా మందిరాలు, పంక్షన్ హాళ్లు, మాల్స్, సినిమాహాల్స్, మల్టీప్లెక్స్ లు లాక్ డౌన్లో భాగంగా మూసివుండనున్నాయి, అన్ని రాజకీయపార్టీల కార్యకలాపాలు, సభలు, ర్యాలీలు, సమావేశాలకు రాష్ట్రంలో అనుమతి లేదు. ఎలాంటి విద్యా సంస్థలు, బార్లు, క్లబ్, పబ్బులు, ఈతకొలనులు, స్టేడియాలు, స్పోర్ట్స్ సెంటర్లు, స్టేడియంలు, జిమ్ములు, పార్కులు, అమ్యూజ్ మెంట్ పార్కులు తెరిచే ప్రసక్తే లేకపోయినా.. బతుకు బండిని లాగేందుకు తెలంగాణ వాసి సంసిధ్దుడయ్యాడు. ఇక ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా సరి-బేసి సంఖ్య విధానంలో దుకాణాలు తెరిచేందుకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది.

హైదరాబాద్ లో మెట్రో రైలు నడవదని కూడా చెప్పింది. హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సు సర్వీసులకు మాత్రం బ్రేకులు కొనసాగునుండగా, రాష్ట్రవ్యాప్తంగా సరిహద్దులు మాత్రం బస్సులు సంచరించనున్నాయి. అయితే అంతరాష్ట్ర బస్సులు, సిటీ బస్సులు మాత్రం నిలిపేవున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, ట్యాక్సీలకు ఉదయం నుంచి రోడ్లపైకి వస్తున్నాయి. ఆటోలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు, క్యాబ్ ల్లో డ్రైవర్ తో పాటు ముగ్గురికి మాత్రమే అనుమతించడంతో ఉదయం నుంచి క్యాబ్ సర్వీసులు కూడా నడుస్తున్నాయి. దీంతో తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో జనం రోడ్లపైకి వస్తున్నారు.

ఇక కరోనా వైరస్ ప్రభంజనం కూడా కొంత ప్రాంతానికి పరిమితం కావడంతో ఆయా ప్రాంతాల్లోనే కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. ఆ ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అన్ని చోట్లా సెలూన్లు, ఈ కామెర్స్ దుకాణాలు తెరుచుకున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు కూడా కేవలం ఆన్ లైన్ డెలివరీలో మాత్రమే అందుబాటులో వచ్చాయి. ఇక హోటళ్లలో బోజనం చేయాలనుకునే వారికి మాత్రం ఇంకా కొన్ని నెలలు వేచివుండాల్సిందే. ఇటు నగరజీవి కూడా ఎన్నాళ్లుగానే ఎదురుచూస్తున్న ఉదయం ఇవాళే వచ్చిందన్న పాటను పాడుకుంటూ తన బతకు బండిని నడుపుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles