Rahul Gandhi on Aurangabad Train Tragedy లాక్ డౌన్ ఎత్తివేతకు ప్రణాళికలు రచించాలి: రాహుల్ సూచన

Migrants need support and money today not tomorrow rahul gandhi

coronavirus outbreak, coronavirus disease, covid 19, Corona Lockdown 3.0, india lockdown, lockdown extended, lockdown open, Rahul Gandhi, Congress party

Congress leader Rahul Gandhi said in a press briefing post the Aurangabad train accident, to put money in people's hands, have a strategy for migrants and prepare post-lockdown guidelines. Migrants need support and money now, and today. MSMEs need help immediately, not tomorrow, or job losses will become tsunami, says Rahul Gandhi.

లాక్ డౌన్ ఎత్తివేతకు ప్రణాళికలు రచించాలి: రాహుల్ సూచన

Posted: 05/08/2020 03:44 PM IST
Migrants need support and money today not tomorrow rahul gandhi

కరోనా నేపథ్యంలో కేంద్రప్రభుత్వం విధిస్తున్న లాక్ డౌన్ ను ఎప్పుడంటే అప్పుడు విధించడానికి.. ఎంతకాలం అనుకుంటే అంతకాలం పొడగించడానికి అది ఆన్-ఆఫ్ స్విచ్ కాదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఔరంగాబాద్ రైలు ప్రమాద ఘటన తరువాత కేంద్రం విధిస్తున్న లాక్ డౌన్.. తీసుకుంటున్న నిర్ణయాలు దేశంలోని వలసజీవులకు శాపంగా పరిణమించాయని ఆయన విరుచుకుపడ్డారు. లాక్ డౌన్ ప్రక్రియకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని, కేంద్రం ఏం చేయబోతోందో రాష్ట్రాలతోనూ, ముఖ్యంగా ప్రజలతోనూ పంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

లాక్ డౌన్ ఎత్తివేత అనేది ఓ సంధికాలం వంటిదని, దానికంటూ ప్రత్యేక విధానం ఉండాలని తెలిపారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా అధికార యంత్రాంగాలను కూడా కేంద్రం భాగస్వాములుగా పరిగణించాలని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా కేంద్రం కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లు, గ్రీన్ జోన్లుగా పేర్కొంటోందని, కానీ జాతీయస్థాయిలో రెడ్ జోన్లుగా చూపిస్తున్నా కొన్ని ప్రాంతాలు, రాష్ట్రస్థాయిలో గ్రీన్ జోన్లుగా ఉన్నాయని సీఎంలే అంటున్నారని రాహుల్ గాంధీ వివరించారు. దీనిపై స్పష్టమైన విధానం అవలంబించాల్సి ఉందని కేంద్రానికి హితవు పలికారు.

లాక్ డౌన్ నుంచి బయటపడేందుకు ప్రణాళికలు రచించారా.? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వలసకూలీల తరలింపుపై వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఆయన చెప్పారు. కష్టసమయంలో పేదలు, కార్మికులకు సాయం చేయాలని, దినసరి కూలీలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వలస కూలీలకు త్వరగా ఆర్థిక సాయం చేయాలని రాహుల్ గాంధీ సూచించారు. వలస కూలీలు, పేదలకు రూ.7000 డబ్బును తక్షణం జమ చేయాలని, ఇలా దేశంలోని పేదలందరికీ చేయడానికి రూ.50 వేల కోట్లు అవుతుందని అన్నారు. ఇక దీంతో పాటు చిన్నతరహా పరిశ్రమలకు ఇప్పుడు చేయూత ఇవ్వాలని ఆయన కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles