PM Modi, Amit Shah express grief over rail accident ఘోరం రైలు ప్రమాదంపై ప్రధాని, రైల్వేశాఖ మంత్రి దిగ్బ్రాంతి..

Pm modi amit shah express grief over migrants death in aurangabad rail accident

train accident maharashtra, PM Modi, Amit Shah, Piyush Goyal, Rajnath, nanded train accident, aurangabad train accident, train accident, migrant workers did in train accident, migrant labour, jalna, aurangabad, bhuvasal, maharashtra, madhya pradesh, goods train, Piyush Goyal, train tragedy, Crime

PM Narendra Modi expressed his condolences over the death of 16 migrant labourers who were crushed by a goods train at Aurangabad's Karmad in Maharashtra on this day. The group was sleeping on the railway tracks when the incident took place.

ఘోరం రైలు ప్రమాదంపై ప్రధాని, రైల్వేశాఖ మంత్రి దిగ్బ్రాంతి..

Posted: 05/08/2020 01:24 PM IST
Pm modi amit shah express grief over migrants death in aurangabad rail accident

మహారాష్ట్రలోని ఔరంగబాద్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంపై పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ మూడవ విడతలో సడలింపులతో పాటు వలసకార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు శ్రామిక్ రైళ్లను అందుకునే ప్రయత్నంలో పట్టాలను అనుసరిస్తూ నడుచుకుంటూ వెళ్తున్నవారిపై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు త్వరగా కోలుకోవాలని ఆయన అకాంక్షించారు.

ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌తో మాట్లాడి.. ఆ ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా ఈ ఘటనపై హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో రైలు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధను కలిగించిందని అమిత్‌ షా అన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌, ఇతర రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు చెప్పారు.

అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందిస్తూ.. ‘మహారాష్ట్రలో రైలు ప్రమాదం జరగడం దురదృష్టకరం. ఇది చాలా విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని చెప్పారు. కాగా, ఔరంగాబాద్‌ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి గూడ్స్‌ రైలు దూసుకెళ్లిన ఘటనలో దాదాపు 16మంది మృతిచెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : migrant labour  aurangabad  maharashtra  madhya pradesh  PM Modi  Amit Shah  Piyush Goyal  Rajnath  train tragedy  Crime  

Other Articles