Remaining CBSE board exams to be held in July జూలైలో సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు..

Cbse class 10 12 exam date 2020 boards from july 1 to 15

cbse exam dates, jrr main 2020 exam dates, cbse dates, cbse 10th 12th board exam dates, cbse dates, cbse date sheet 2020, cbse nic in

Union HRD Minister has announced the CBSE EXam Dates 2020. Pending Examination for CBSE Board 2020 would now be conducted from July 1 to July 15. The detailed schedule would be released by the board soon. Check out the message from Union HRD Minister here.

జూలైలో సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు..

Posted: 05/08/2020 07:47 PM IST
Cbse class 10 12 exam date 2020 boards from july 1 to 15

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా ఆగిపోయిన సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లపై క్లారిటీ వ‌చ్చింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలను జూలై 1 నుంచి 15 వ‌ర‌కు నిర్వ‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్ని కేంద్ర మాన‌వవ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ ఇవాళ వెల్లడించారు. సీబీఎస్ఈ పరీక్షల కోసం విద్యార్థులంతా ప్రిపేర్ అవ్వాలని ఆయన సూచించారు. జూలైలో నిర్వహించే పరీక్షలక విద్యార్థులకు ఆయన ఇవాళ ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా, పరీక్షల టైమ టేబుల్ షెడ్యూల్ ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌న్నారు.

ప్రతీ ఏడాది మార్చి-ఏప్రిల్ మాసాల్లో నిర్వహించే ఈ పరీక్షలు ఈ ఏడాది కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ తో పరీక్షలు వాయిదాపడ్డాయి. టెన్త్ ప‌రీక్ష‌లు దేశ వ్యాప్తంగా పూర్తి కాగా.. సీఏఏ అల్ల‌ర్ల కార‌ణంగా ఈశాన్య ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలో మాత్రం కొన్ని స‌బ్జెక్ట్స్ ప‌రీక్ష‌లు ఆగిపోయాయి. దీంతో పదవ తరగతి పరీక్షలన్నీ పూర్తైన తరువాత నిర్వహిద్దామని భావించింది సీబీఎస్ఈ బోర్డు. కానీ టెన్త్ ఎగ్జామ్స్ పూర్త‌య్యే స‌మ‌యానికి క‌రోనా వైర‌స్ వ్యాప్తి పెర‌గ‌డంతో కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది.

ఇక పన్నెండవ తరగతి పరీక్షలకు ప్రారంభానికి ముందే లాక్ డౌన్ అమల్లోకి రావడంతో ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా వాయిదా ప‌డ్డాయి. దీంతో ఈ ఎగ్జామ్స్ నిర్వ‌హ‌ణ‌పై ఉత్కంఠ నెల‌కొంది. ఎట్ట‌కేల‌కు జూలై 1 నుంచి 15 వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని శుక్ర‌వారం ప్ర‌క‌టించారు కేంద్ర మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్. అయితే అన్నీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం ఇబ్బంది మారుతుంద‌ని యూనివ‌ర్సిటీ ప్ర‌వేశాల‌కు సంబంధించిన ముఖ్య‌మైన 29 స‌బ్జెక్టుల‌కు మాత్ర‌మే ఎగ్జామ్స్ పెడుతామ‌ని గ‌తంలోనే కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వీటికి సంబంధించిన షెడ్యూల్ ను త్వ‌ర‌లోనే సీబీఎస్ఈ బోర్డు ప్ర‌క‌టించ‌నుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles