PM, CMs discussed graded lockdown exit on video call సీఎంలతో ప్రధాని మోడీ ఏం మాట్లాడారంటే..

Pm modi holds crucial meet with cms over coronavirus crisis and lockdown strategy

Inarendra modi meeting with CM, narendra modi on coronavirus, narendra modi live meeting today, PM Modi, PM Modi Live, PM Narendra Modi with CMs, PM Narendra Modi talk with Chief Ministers, Narendra Modi meeting with Chief Minister Today, PM Modi Live Updates, PM Modi on Lockdown, pm modi lockdown extension, pm modi on 3rd lockdown

Prime Minister Narendra Modi is taking stock of the coronavirus situation in the country today as he holds a video conference with chief ministers of all states. The prime minister has held two such interactions with the chief ministers before.

లాక్ డౌన్ తరువాత.? ముఖ్యమంత్రులతో ప్రధాని ఏం మాట్లాడారంటే..

Posted: 04/27/2020 02:48 PM IST
Pm modi holds crucial meet with cms over coronavirus crisis and lockdown strategy

కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతున్న వేళ దేశంలో నెలకొన్న పరిస్థితులు.. లాక్ డన్ ఎత్తివేత తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో సమవేశమై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయాలను తీసుకున్నారు. మే 3వ తేదీలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ముగియనున్న విషయం తెలిసిందే. మండలం రోజుల పాటు లాక్ డౌన్ ను అమలు చేస్తే, కరోనాను తరిమికొట్టవచ్చన్న ఆలోచనతో తొలుత 21 రోజులు, ఆపై మరో 19 రోజుల లాక్ డౌన్ ను ప్రధాని నరేంద్ర మోదీ తెరపైకి తెచ్చారన్న విషయం తెలిసిందే.  

ఇవాళ వీడియో కాన్ఫెరెన్స్ ప్రధాని మోదీ అందరు ముఖ్యమంత్రులతో సమావేశమై ముఖ్యమంత్రులు అభిప్రాయాలను తీసుకున్నారు. పలురాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఇప్పటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ పొగడించాలన్న అభిప్రాయాన్ని కూడా ప్రధాని ముందు ఉంచాయని సమాచారం. లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు ఆగిపోయి, కోట్లాది మంది తమ ఉపాధిని కోల్పోయిన వేళ, ఆర్థిక వృద్ధి పాతాళానికి పతనం కాగా, దాన్ని తిరిగి నిలిపేలా కొన్ని కీలక నిర్ణయాలను ఈ దఫా మోదీ ప్రకటిస్తూ, లాక్ డౌన్ నుంచి ఉపశమనాన్ని కలిగించవచ్చని తెలుస్తోంది.

ఇదే సమయంలో వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి, ప్రజా రవాణాను తిరిగి తెరవడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవచ్చని కూడా మోదీ వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉన్నాయని పీఎంఓ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో సీఎంల సలహాలను తొలుత అడిగి తెలుసుకోవాలన్న ఆలోచనతో ఉన్న మోదీ, ఆపై మొత్తం పరిస్థితిని సమీక్షించి, లాక్ డౌన్ ను పొడిగించాలా? లేక సడలింపులు ఇవ్వాలా? అన్న విషయమై తుది నిర్ణయానికి వస్తారని సమాచారం.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచాలని, ఆర్థిక సాయం అంశాలను పలు రాష్ట్రాలు ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది. దశల వారీగాలాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని ఇప్పటికే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. దేశంలో ఇప్పటివరకు 27,892 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 872 మంది మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో సీఎంలతో జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian CMs  PM Modi  Narendra Modi  video conference  Lockdown stratagies  coronavirus  covid-19  India  

Other Articles