6 New Possible Symptoms Of COVID-19 కరోనా లక్షణాల జాబితాలో మరో ఆరు చేరాయి.. అవేంటో తెలుసా.?

No evidence recovered virus patients are immune

virus patients are immune, corona patient are immune, Corona symptoms, corona virus, Corona Virus Symptoms, Coronavirus, Covid-19, possible symptoms, Immune, second blow, severe acute respiratory syndrome coronavirus 2, SARS-CoV-2, COVID-19, coronavirus pandemic, outbreak, symptoms, CDC, Centers for Disease Control and Prevention, diagnosis, fever, chills, testing, disease

For a while, the “Symptoms of Coronavirus” list on their Coronavirus Disease 2019 (COVID-19) website stayed at three symptoms: fever, cough, and shortness of breath or difficulty breathing. Not anymore. The CDC has now added six more to bring the total to nine. The six new additions are: Chills, Repeated shaking with chills, Muscle pain, Headache, Sore throat, New loss of taste or smell

కరోనా లక్షణాల జాబితాలో మరో ఆరు చేరాయి.. అవేంటో తెలుసా.?

Posted: 04/27/2020 08:24 PM IST
No evidence recovered virus patients are immune

ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ మ‌హ‌మ్మారి నెలల వ్యవధిలోనే తన రూపాలను మార్చుకుంటూ వ్యాధి లక్షణాలను కూడా మార్చేస్తూ వస్తుంది. గత ఏడాది నవంబర్ మాసంలో వూహాన్ నగరంలో బయటపడ్డ ఈ వైరస్.. ఆరు మాసాలు కూడా నిండినిండకుండానే తన వ్యాధి లక్షణాల జాబితాను మూడు నుంచి తోమ్మిదికి పెంచుకుంది. నానాటికీ కొత్త రూపాలు సంత‌రించుకుంటూ మరింత బలోపేతం అవుతోంది. ఈ తరుణంలోనే సిడిసీ వెలువరించిన మరో వార్త ప్రపంచ మానవాళిని తీవ్ర అందోళనకు గురిచేస్తోంది.

సమాజంలో ప్రభావితం చేస్తున్న కరోనా వైరస్ ముదిరిపాకాన పడుతున్న కొద్దీ.. ల‌క్ష‌ణాలు జాబితాలోకి మరికొన్ని లక్షణాలు వచ్చి చేరుతున్నాయి. ఇప్ప‌టిదాకా ద‌గ్గు, జ్వ‌రం, శ్వాస పీల్చుకోవ‌డంలో ఇబ్బందులు ఉంటే అవి క‌రోనా ల‌క్ష‌ణాలుగా భావిస్తూ వచ్చారు వైద్యులు. అయితే తాజాగా డాక్ట‌ర్ల అనుభ‌వాల నుంచి మ‌రికొన్ని కొత్త ల‌క్ష‌ణాలు కూడా క‌రోనా వైర‌స్ సోకింద‌న‌డానికి ప్రేర‌కాలుగా నిలుస్తున్నాయి. అమెరికాలోని “ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్” (సీడీసి) అధ్య‌య‌నం ఈ విధంగా వెల్ల‌డించింది.

నాసికా రంభ‌రించ‌లేనంతాగా జ‌లుబు చేయ‌డం, చ‌లి, చ‌లితో వ‌ణుకు, కండ‌రాల నొప్పి, త‌ల‌నొప్పి, గొంతు నొప్పి, నాలుక రుచిని కోల్పోవ‌డం, ముక్కు వాస‌న ప‌సిగ‌ట్ట‌లేక‌పోవ‌డం కూడా క‌రోనా ల‌క్ష‌ణాలుగా డాక్ట‌ర్లు చెబుతున్నారు. అంటే మొద‌ట్లో ఉన్న ల‌క్ష‌ణాల క‌న్నా ఇప్పుడు అవి మూడింత‌లు పెరిగాయ‌న్న మాట‌! ఈ ల‌క్ష‌ణాలుంటే రెండు నుంచి ప‌ద్నాలుగు రోజుల్లోప‌ల క‌రోనా వైర‌స్ పాజిటివ్ గా తేలే అవ‌కాశాలున్నాయ‌ని వ్యాధి నియంత్ర‌ణ‌, నివార‌ణ కేంద్రాల( సీడీసీ) నిపుణులు చెబుతున్నారు.

పైన పేర్కొన్న ల‌క్ష‌ణాల్లో ఎవరికైనా ఏ ఒక్క లక్షణం కనిపించినా… వెంటనే అలర్ట్ అవ్వాలి. ఇంట్లోనే ఉంటూ… మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ… ఇంట్లో వాళ్లను కూడా దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్త పడాలి. వెంట‌నే వైద్య‌సాయం తీసుకోవాల్సిందిగా వారు హెచ్చ‌రిస్తున్నారు.  ఈ ల‌క్ష‌ణాలేమీ లేక‌పోయినా, కొంద‌రిలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ వ‌చ్చే అవ‌కాశాలూ ఉన్నాయ‌ని వారు అంటున్నారు. ఉత్త‌ర ఇట‌లీలో ఒక మ‌హిళ‌కు కాళ్ల మీద ద‌ద్దుర్లు వ‌చ్చాయ‌ని, ఆమెకు ప‌రీక్ష‌లు చేస్తే క‌రోనా పాజిట‌వ్ అని తేలింద‌ని డాక్ట‌ర్లు గుర్తు చేస్తున్నారు.అలాగే ఐస్ లాండ్‌లో ఎలాంటి ల‌క్ష‌ణాలు లేకుండానే ఈ వైర‌స్ సోకిన‌ట్టు వెల్ల‌డైంద‌ని మ‌రికొంద‌రు డాక్ట‌ర్లు గుర్తు చేస్తున్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ సామాజిక దూరం, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌, మంచి ఆరోగ్య‌వంత‌మైన ఆహారం తీసుకుంటూ..రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించుకోవ‌టంతో  క‌రోనాను జ‌యించ‌వ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles