కరోనా కాటువేస్తున్న క్రమంలో అగ్రరాజ్యం అమెరికా దాని బారి నుంచి తేరుకోలేకపోతుంది. అగ్రరాజ్యంలో క్రితంరోజు మరో 1,741 మంది మృతిచెందారు. పాజిటివ్ కేసుల సంఖ్య పది లక్షలు దాటింది. జార్జియా, ఒక్లహామా, అలస్కా, టెక్సాస్ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ మినహాయింపులతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే, దీనిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్లు ఎక్కువశాతం ‘స్టే ఎట్ హోమ్’కు మొగ్గుచూపుతున్నారని ఓ సర్వేలో తేలింది. రోగుల చికిత్సలో డిస్‌ఇన్పెక్టంట్స్ ఇంజెక్షన్స్, అతినీల లోహిత కిరణాల వినియోగంపై వ్యాఖ్యలు దుమారం రేపడంతో మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని ట్రంప్ నిర్ణయించారు.
అంతేకాదు ఆయనకు స్వతహాగా వుండే మీడియాపై అక్కస్సును ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లగక్కారు. ‘వారు (మీడియా) ఎలాగూ విరుద్ధ ప్రశ్నలు అడుగుతారు. వాస్తవాలను రిపోర్ట్ చేయరు. వారికి మంచి రేటింగ్స్ రావొచ్చు. అమెరికన్లకు తప్పుడు వార్తలు తప్ప ఏ ప్రయోజనం ఉండదు. దానితో సమయం, పని వృథా’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. హ్యూస్టన్‌లో ప్రవాస భారతీయలు నడుపుతున్న ‘సేవా ఇంటర్నేషనల్’ సంస్థ 30 వేల మాస్క్‌లు, గ్లోవ్స్, 20 వేల ఔన్స్‌ల శానిటైజర్‌ను ఆస్పత్రులు, అధికారులకు పంపిణీ చేసింది. రష్యాలో రికార్డు స్థాయిలో 6,361 కేసులు నమోదయ్యాయి. 66 మంది చనిపోయారు. మొత్తం సంఖ్య 747కు చేరింది.
నెలలో అత్యల్పంగా.. యూకేలో 413 మంది మృతి చెందారు. ఆఫ్రికా ఖండంలో కేసులు 30 వేలు దాటాయి. 1,374 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా 60 మందితో కలిపి ఇరాన్‌లో మృతుల సంఖ్య 5,710కి చేరింది. సింగపూర్‌లో కేసులు 13 వేలను దాటాయి. కొత్తగా 931 మంది వైరస్ బారినపడ్డారు. ఢాకాలోని 31 మంది ఇస్కాన్ ఆలయ సిబ్బంది కరోనా సోకింది. పరీక్షలు, చికిత్స అందించే సామర్థ్యం లేకపోవడంతో.. 3,200 మంది భారతీయులను పంపించేందుకు హాంకాంగ్ సిద్ధమైంది. కరోనాతో చనిపోనప్పటికీ.. ముగ్గురు ప్రవాసుల మృతదేహాలను వెనక్కు పంపడంపై యూఏఈలోని భారత రాయబారి పవన్ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more