Coronavirus cases in India reaches 20000 mark death toll at 640 దేశంలో 640 కు చేరిన కరోనా మరణాలు.. 20 వేలు చేరిన కేసులు

Coronavirus in india covid 19 cases in india reaches 20 000 mark death toll at 640

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

The total number of coronavirus cases in India today reaches over 20,000 mark after 1.533 new infections were reported in past 24 hours, according to the latest data from Health Ministry. The death toll has gone up to 640 while 3870 have recovered, showed the latest data.

దేశంలో 640కు చేరిన కరోనా మరణాలు.. 20 వేల మార్క్ చేరిన కేసులు

Posted: 04/22/2020 12:49 PM IST
Coronavirus in india covid 19 cases in india reaches 20 000 mark death toll at 640

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దాని ప్రభావం దాటికి కొలుకునేవారి సంఖ్య భారీగానే వున్నా అసువులు బాస్తున్న వారి సంఖ్య కూడా అందోళనకరంగానే వుంది. దేశంలో ఈ వైరస్ మహమ్మారి విస్తృతం కాకుండా లాక్ డౌన్ విధించినప్పటికీ అటు వ్యాప్తి, ఇటు మరణాల సంఖ్యకు ఏమాత్రం చెక్ పడటంలేదు. దీంతో దేశప్రజల్లో కలవరం అంతకంతకూ పెరుగుతూనే వుంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 50 మంది మరణించారని పేర్కొంది.

దీంతో ఇవాళ ఉదయానికి దేశంలో నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 640కు చేరింది. కరోనా కేసుల సంఖ్య సుమారుగా 20 వేల మార్కుకు చేరిందని వెల్లడించింది. ఇవాళ్టి వుదయానికి 19 వేల 984 మంది ఈ మహమ్మారి ప్రభావానికి గురయ్యారు. ఈ వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 3870 మంది కోలుకున్నారని చెప్పారు. ప్రతి 24 శాంపిళ్లలో 1 కరోనా పాజిటివ్‌ కేసు నమోదవుతోందని తెలిపిన అధికారులు.. దేశవ్యాప్తంగా కరోనా బారినపడి కోలుకుంటున్నవారి శాతం 19.36గా ఉందని ప్రభుత్వం తెలిపింది. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది.

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతరం అవుతొంది. రాష్ట్రంలో కొవిడ్‌ సోకి ఇప్పటి వరకూ 251మంది మృత్యువాతపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 5218 చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇక గుజరాత్లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే ఒక్కడ ఈ వైరస్‌ బారినపడి 90మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 2178కి చేరింది. మధ్యప్రదేశ్‌లోనూ కరోనాతో మరణించే వారిసంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక్కడ ఈ వైరస్‌కు 76మంది బలయ్యారు. దిల్లీలోనూ కరోనా వైరస్‌తో ఇప్పటివరకు 47మంది మరణించారు. కేసుల సంఖ్య 2156కు చేరింది. దేశంలో ఏడురాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వేయి దాటింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles