Head constable hits senior with baton ఎస్ఐపై లాఠీని ఝుళిపించిన హెడ్ కానిస్టేబుల్

Head constable hits senior sub inspector with baton suspended

covid-19, coronavirus, lockdown, fight aginst covid-18, subinspector, Sitapur district, Ramashray, police, Kotwali Nagar, coronavirus Lockdown, covid-19 Lockdown, si Ramesh, sub inspector, checkpost checking, SP LP kumar, Lucknow, Uttar Prades, Crime

Hours after a video showing a head constable attacking a senior sub-inspector with a baton in Sitapur district went viral on social media, the head constable was suspended while an FIR against him was registered at Kotwali police station area in the district

ITEMVIDEOS: ఎస్ఐపై లాఠీని ఝుళిపించిన హెడ్ కానిస్టేబుల్

Posted: 04/22/2020 11:48 AM IST
Head constable hits senior sub inspector with baton suspended

పోలీసులు సామాన్యులపై అకారణంగానో లేక చిరెత్తి వున్నప్పుడో లాఠీలను ఝుళిపించిన అనేక ఘటనలు చూశాం. ఎంతకాదనుకున్నా. వారు మానవమాత్రులే కదా.. వారికి కోసం తాపం అగ్రహం లాంటి కామకోద్రాలు వుంటాయి కదా.. అంటూ సరిపెట్టుకుంటాం. అయితే పలు సందర్భాల్లో కిందిస్థాయి పోలీసు సిబ్బంది తమ ఉన్నతాధికారులపై అక్కస్సును విపరీత చర్యలకు దారితీసేలా వ్యవహరించడం కూడా అక్కడక్కడా చూశాం. ఇలా కాని పక్షంలో తమ ఉన్నతాధికారులపై అంతకుమించిన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే ఉత్తరప్రదేశ్లో ఇందుకు బిన్నమైన ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ ఏకంగా అతని పై పైఅధికారిపైనే లాఠీని ఝుళిపించాడు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కోనసాగుతున్న తరఉణంలో తన విధులను సక్రమంగా నిర్వహించకుండా చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ను తిట్టినందుకు గాను పై అధికారిపై హెడ్ కానిస్టేబుల్ లాఠీతో బదులు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో వెంనువెంటనే స్పందిచంిన జిల్లా ఉన్నాతాధికారులు చర్యలు చేపట్టారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్‌ రామశరాయ్‌ లాక్ డౌన్‌ విధులు నిర్వహిస్తున్నాడు. సరిగ్గా తనిఖీలు చేయడం లేదనే కారణంతో సీనియర్ సబ్ ఇన్స్‌పెక్టర్ రమేష్ అతన్ని తిట్టాడు. దీంతో ఆగ్రహించిన రామశరాయ్ లాఠీతో రమేష్‌ను కొట్టాడు. ఈ వీడియో వైరల్ గా మారడంతో పాటు ఎస్ఐ రమేష్ విషయాన్ని కంట్రోల్ రూమ్ కు తెలియజేశాడు. వెంటనే స్పందించిన జిల్లా పోలీసు అధికారులు రామశరాయ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. అంతేకాదు హెడ్ కానిస్టేడుల్ పై పలు సెక్షన్ల కింద కేసును కూడా నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : subinspector  Sitapur district  Ramashray  police  Kotwali Nagar  coronavirus  covid-19  Lockdown  Lucknow  Uttar Prades  Crime  

Other Articles