KCR seeks extension of lockdown by couple of weeks మరో రెండువారాలు లాక్ డౌన్ విధించాలని ప్రభానిని కోరిన సీఎం

Kcr says country s only weapon against covid 19 is lockdown asks pm for extension

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana,' Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus hyderabad new cases, coronavirus new cases, coronavirus nee cases in hyderabad, coronavirus new cases in Telangana, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

Telangana Chief Minister K. Chandrashekar Rao suggested that the nationwide lockdown should be extended for a couple of weeks to contain the spread of coronavirus. He appealed to Prime Minister Narendra Modi to extend the lockdown beyond April 14 for one or two weeks.

మరో రెండువారాలు లాక్ డౌన్ విధించాలని ప్రభానిని కోరిన సీఎం

Posted: 04/06/2020 09:21 PM IST
Kcr says country s only weapon against covid 19 is lockdown asks pm for extension

ప్రపంచవ్యాప్తంగా కదం తొక్కుతూ వేలాది మంది ప్రాణాలను కబళించిన కరోనా వైరస్ మహమ్మారి.. ఇటు భారత్ లోనూ పంజా విసిరింది. భారతీయులంతా ఈ మహమ్మారిని దృడవిశ్వాసంతో ఎదుర్కోన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. అయినా ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ఘటనతో భారత్ లోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి సోకింది. మూడింట ఒకవంతు మత ప్రార్థనలకు హజరైనవారి వల్లే వ్యాధి సోకిందని గణంకాలు వున్నాయని, ఇక మన తెలంగాణలో ఈ సంఖ్య మూడింట రెండోంతులు వుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.  

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరో వారం నుంచి రెండు వారాల పాటు లాక్ డౌన్ కొనసాగించడంతో భారత్ లో వైరస్ నియంత్రణ చేపట్టవచ్చునని అన్నారు. లేకపోతే 21 రోజుల పాటు చేసిన లాక్ డౌన్ ఫలితాలు కూడా వృధాగా మారే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల అరోగ్యానికి పెద్దపీట వేయాలన్న యోచనతోనే తాను ఈ మేరకు కేంద్రప్రభుత్వానికి అపీల్ చేస్తున్నానని అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలకు, దేశ అర్థికానికి తీరని విఘాతం ఏర్పడుతుందని, అయితే ఆర్థిక లోటుపాట్లను క్రమంగా ఐదారు మాసాల్లో అధిగమించవచ్చునని, కానీ ప్రజల ప్రాణాలను మాత్రం తీసుకురాలేమని ఆయన స్పష్టం చేశారు.

కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే సరైన ఆయుధమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈమేరకు ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. లాక్ డౌన్ ను ఎంత కఠినంగా అమలు చేస్తే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. భారత్ లో జూన్ 3 వరకు లాక్ డౌన్ పాటించాలని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కూడా చెప్పిందని వివరించారు. లాక్ డౌన్ ను సడలించిన తర్వాత జనం గుంపులుగా వస్తే ఎవరు జవాబుదారీ? అని ప్రశ్నించారు. ఏదేమైనా, లాక్ డౌన్ సడలింపు అంటే అంత తేలిక కాదని అన్నారు.

తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 364 అని తెలిపిన కేసీఆర్.. ఇప్పటివరకు 11 మంది చనిపోయారని వెల్లడించారు. ప్రస్తుతం 308 మంది కరోనా బాధితులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.  కాగా, చనిపోయిన వారందరూ మర్కజ్ కు వెళ్లొచ్చినవారేనని వివరించారు. మర్కజ్ నుంచి వచ్చినవారిలో 1089 మందిని అనుమానితులుగా భావించి వైద్యపరీక్షలు చేస్తే 172 మందికి కరోనా నిర్ధారణ అయిందని తెలిపారు. ఆ 172 మంది మరో 93 మందికి అంటించారని సీఎం చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 25,937 మందిని క్వారంటైన్ చేశామని, వారిలో 50 మందికి పాజిటివ్ అని తేలిందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 30 మందికి, వారి కుటుంబ సభ్యులు 20 మందికి వ్యాధి సోకింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles