PM''s appeal: State govts to monitor power situation కరోనాపై యుద్దం: ప్రధాని పిలుపుకు సన్నధమయ్యాం: విద్యుత్ శాఖ

Discoms urge residents to not turn off electrical gadgets except lights on april 5

Narendra Modi, Coronavirus, Narendra Modi news, power crids Trip, Narendra Modi latest, Narendra Modi video, Narendra Modi message, Narendra Modi about coronavirus, Coronavirus news, Coronavirus updates, Narendra Modi New Video Message About Coronavirus, Narendra Modi, PM Modi, New Video Message, Coronavirus, LIghts, candles, Oil Lamps, electrical bulbs, Covid-19, People of India

Power discoms and transmission companies of all the state have appealed to all electricity consumers to not switch off their electrical gadgets like air conditioners, refrigerators, among other appliances and also not to shut down the main supply connection of buildings On Sunday.

కరోనాపై యుద్దం: ప్రధాని పిలుపుకు సన్నధమయ్యాం: విద్యుత్ శాఖ

Posted: 04/04/2020 04:43 PM IST
Discoms urge residents to not turn off electrical gadgets except lights on april 5

కరోనా కట్టడిని చేసేందుకు తాజాగా దేశప్రజలకు ముందుకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ మరో సూచన చేశారు. మార్చి 22న ఆదివారం జనతా కర్ఫ్యూను పాటించాలని గతంలో సూచించిన ప్రధాని ప్రజలు విధించుకున్న కర్ప్యూ నేపథ్యంలో ఎవరూ తమాంతట తాము రోడ్లపైకి రాకూడదని చెప్పారు. కాగా తాజాగా రానున్న ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల 9 సెకన్ల పాటు ఇంట్లో ఉన్న లైట్లు బంద్ చేసి.. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. అయితే ఈ పిటుపు నేపథ్యంలో తాజాగా విద్యుత్ శాఖ అధికారులు కూడా తాము అన్ని విదాలుగా సిద్దంగా వున్నామని స్పష్టం చేశారు.

దేశప్రజలదరూ ఒకే సారి లైట్లు ఆపివేయడం వల్ల గ్రిడ్‌పై ఒకేసారి ప్రభావం పడుతుందని దీంతో గ్రిడ్లు ట్రిప్ అయ్యే అకకాశాలు కూడా వుంటాయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి సంజీవ్ నందన్ సాహ్లి లేఖ రాశారు. కేంద్రం కేవలం లైట్లు మాత్రమే ఆపమని చెప్పిందని, ఇంట్లోని  ప్రిజ్‌, ఏసీ, టీవీ తదితర వస్తువులను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. వీధి లైట్లు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు.

వీధి లైట్లు, శాంతి భద్రతల విషయంలో స్థానిక ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆస్పత్రులు సహా అన్ని అత్యవసర ప్రదేశాల్లో లైట్లు ఆపాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఒకేసారి లైట్లన్నీ ఆపేయడం వల్ల పవర్‌గ్రిడ్‌లు కుప్పకూలిపోతాయంటూ వస్తున్న పుకార్లపై కేంద్ర విద్యుత్‌ శాఖ వివరణ ఇచ్చింది. గ్రిడ్‌లకు ఎలాంటి నష్టం వాటిల్లబోదని స్పష్టం చేసింది.  మరోవైపు పవర్‌ గ్రిడ్‌పై ప్రభావం పడుతుందటూ వస్తున్న పుకార్లపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వివరణ ఇచ్చారు. ఒకేసారి లైట్లు ఆపితే గ్రిడ్‌పై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు. తగిన జాగ్రత్తలతో గ్రిడ్‌కు సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించారు. ఒకేసారి లైట్లు ఆపితే గ్రిడ్‌ కుప్పకూలుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles