commissioner praises constable for his dedicates duty కానిస్టేబుల్ కర్తవ్య నిర్వహణకు దక్కిన కమీషనర్ ప్రశంస

Hyderabad cop rewarded for shifting pregnant woman to hospital

Coronavirus, COVID-19, police duties in lockdown, police constable, police commissioner, sai kishan, anjani kumar, wife delivery, baby boy, sweets and biscuits, Hyderabad, narayana guda, Liberty PS, hyderabad commissioner anjani kumar, marredpally, marredpally police station, p mohan rao, Telangana

A constable working with the Marredpally police station, who shifted a woman to a maternity hospital in a police vehicle, was rewarded by Hyderabad Commissioner Anjani Kumar.

కానిస్టేబుల్ కర్తవ్య నిర్వహణకు దక్కిన కమీషనర్ ప్రశంస

Posted: 04/04/2020 03:35 PM IST
Hyderabad cop rewarded for shifting pregnant woman to hospital

చిరుద్యోగికి ఉన్నతాధికారి ప్రశంస కొండంత బలాన్నిస్తుందనడానికి ఉదాహరణగా నిలుస్తుందీ ఘటన. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ కుటుంబం గురించి తెలుసుకున్న సీపీ అంజనీ కుమార్‌ అతన్ని అభినందించారు. విపత్కర పరిస్థితుల్లో తీపి కబురు చెప్పిన ఆ కానిస్టేబుల్‌ను ప్రశంసించారు. ఇక మరో ఘటనలో అత్యంత వేంగా స్పందించని కానిస్టేబుల్.. అంబులెన్స్ కు ఫోన్ చేయకుండా.. తాను విధులు నిర్వహిస్తున్న కారులోనే బాధితురాలిని అసుపత్రికి తరలించడంపై కమీషనర్ రివార్డును అందించారు.

హైదరాబాద్ పోలీస్ అంజనీకుమార్‌ తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో చెక్‌ పోస్టుల వద్ద, కూడళ్లలో డ్యూటీ చేస్తున్న కానిస్టేబుళ్లు, అధికారులతో ముచ్చటించారు. వారి బాగోగులు, కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. లిబర్టీ వద్ద విధులు నిర్వహిస్తున్న నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ సాయికిషన్‌ తనకు రెండ్రోజుల క్రితం బాబు పుట్టాడని చెప్పగా.. సీపీ ఆశ్చర్యపోయారు. ఇలాంటి సమయంలో కూడా కుటుంబాన్ని వదిలి విధులకు హాజరైన అతన్ని మెచ్చుకున్నారు. మిఠాయిలు, బిస్కట్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సీపీ వచ్చి స్వయంగా శుభాకాంక్షలు చెప్పడంతో కానిస్టేబుల్‌ సాయి కిషన్‌ ఆనందానికి అవధుల్లేవు.

తమను ఇంతగా ప్రోత్సహిస్తున్న సీపీ అంజనీకుమార్ కు కానిస్టేబుల్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికైనా సిద్ధమని సాయికిషన్‌ తెలిపారు. ఇక మరోఘటనలో వెస్ట్ మారేడ్ పల్లికి చెందిన ఓ గర్భణికి అకస్మాత్తుగా నోప్పులు ప్రారంభం కావడంతో అమె కుటుంబసభ్యులు డయల్ 100కు ఫోన్ చేశారు. ఈ కాల్ తీసుకున్న కానిస్టేబుల్ మోహన్ రావు వెంటనే పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో వారిని స్థానిక అసుపత్రికి తరలించాడు. వేగంగా స్పందించిన కానిస్టేబుల్ కు కమీషనర్ మెమొంటోతో పాటు రూ.5000 రివార్డును కూడా ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles