కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ తరుణంలో పరోక్షంగా కూడా దీని ప్రభావం బారిన పడి పలువురు మరణిస్తున్నారు. కొందరు ఈ భయంకర మహమ్మారి గురించి తెలుసుకుని అందోళన చెందిన మరణించగా, మరికోందరు రోగం బారిన పడి మరణిస్తున్నారు. కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. పలు దేశాల్లో ఈ ప్రాణాంతక వైరస్ విజృంభించినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని ఫలితంగా అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి చేయి దాటిపోయింది. మృతదేహాలపై కప్పే లక్ష కవర్లు అర్డర్ ఇచ్చారన్న వార్తలతో అక్కడ కరోనాైవైరస్ ఎంతలా విలయతాండవం చేస్తోందో ప్రపంచ దశాలకు అర్థం అవుతోంది.
ఓ వైపు పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా.. అదే స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే 1480 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికైనా అమెరికా ప్రభుత్వం మేకపోతు గాంభీర్యాన్ని వదిలి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని.. తమ దేశ ప్రజల ప్రాణాలను రక్షించాలన్న వినతులు కూడా వెల్లివిరుస్తున్నాయి. గురువారం రాత్రి 8.30 నుంచి శుక్రవారం రాత్రి 8.30 గంటల మధ్య ఈ మరణాలు సంభవించినట్టు జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. మరోవైపు అగ్రరాజ్యంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 77 వేల 467 కు చేరింది.
అమెరికాలో ఇప్పటిదాకా 7402 మంది చనిపోయారు. శుక్రవారం ఒక్క రోజే 32 వేల పైచిలుకు కొత్త కేసులు నమోదుకాగా, ఏకంగా 1480 మరణాలు సంభవించాయని సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో అత్యంత ప్రభావితమైన రాష్ట్రాల్లో స్టే అట్ హోం. సెల్ప్ క్వారంటైన్ కొనసాగుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా మరణాల సంఖ్య 59 వేలు దాటింది. అన్ని దేశాలలో కలపి ఇప్పటివరకు సుమారు పదకొండు లక్షల మంది ప్రజలు ఈ వైరస్ భారిన పడినట్లు గణంకాలు స్పష్టం చేస్తున్నాయని ఈ మేరకు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more