COVID-19 cases may peak in India by April end: ICS దేశంలో కరోనా పంజా ప్రభావం ఎంత.? తేలిది నెలాఖరునే..

Coronavirus cases likely to peak in india by april end ics

Coronavirus, Indian Chest Society, India covid-19 pandemic, Ventilators, ICU beds, Coronavirus peak in India,Coronavirus worst case scenario,ICS Webinar on coronavirus,Indian Chest Society,COVID-19 pandemic,Coronavirus india updates, coronavirus death, Nizamuddin markaz, Muslims quarantine, coronavirus tests, chennai, Tamil nadu coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

The Indian Chest Society (ICS) has evaluated that India is likely to experience its peak in terms positive Covid-19 cases by the end of April. The worst-case scenario of the coronavirus pandemic in India and in that case, the country would need 1 crore ventilators and about 4 crore ICU beds.

దేశంలో కరోనా పంజా ప్రభావం ఎంత.? తేలిది నెలాఖరునే: ఇండియన్ చెస్ట్ సోసైటీ

Posted: 04/04/2020 01:14 PM IST
Coronavirus cases likely to peak in india by april end ics

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న వార్తలు వింటూనే ప్రజలు తీవ్ర భయాందోళనకు చెందుతున్నారు. ఈ క్రమంలో మన దేశంలో ఈ మహమ్మారి అంతగా ప్రభావం చూపకుండా కేంద్రప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. ఈ చర్యల ప్రభావంతో భారత్ లో ఇప్పటివరకు కరోనా వైరస్ ప్రభావం అంతగా లేదనే చెప్పాలి. అయితే 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ విధించే ముందు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మార్కజ్ బిల్డింగ్ లో జరిగిన మతపరమైన తబ్లిగీ జమాత్ ప్రార్థనల్లో పాల్గోన్నవారితోనే ఇప్పుడు అసలు సమస్య భారతీయులు ఎదుర్కోనున్నారు.

జమాత్ లో పాల్గొన్నవారంతా గత నెల 17న వారి స్వస్థలాలకు చేరుకుని.. అక్కడ పలు ఆధ్యాత్మిక కార్యాక్రమాలతో పాల్గోన్నారు. అంతేకాదు అనేక ప్రాంతాలలో సంచరిస్తూ, ఎందరెందరినో కలిశారు. మార్చి 22న జనతా కర్ప్యూతో పాటు దేశవ్యాప్త లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. వీరు తమ ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ క్రమంలో మెల్లగా వారిలో కరోనా లక్షణాలు బయటపడటంతో వీరి నుంచి ఇతరులకు వైరస్ సోకిన నేపథ్యంలో ఎంతమంది ఈ మహమ్మారి బారిన పడ్డారు అన్న వివరాలు ఈ నెల చివరినాటికి కానీ పూర్తిస్థాయిలో తెలసిరావని అంటున్నారు నిఫుణుల.

ఈ నెల చివరినాటికి భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని ఇండియన్‌ చెస్ట్‌ సొసైటీ తెలిపింది. అగ్రరాజ్యం అమెరికాల ఈ వైరస్ ప్రవేశించిన తరువాత నెల రోజులకు భారత్ లోకి ప్రవేశించిందని దీంతో భారత్ లో ఎంతమేర విఫత్కర పరిస్థితులు నమోదవుతాయన్న విషయాలు ఈ నెలాఖారున కానీ వచ్చే నెల తొలివారంలో కాని పూర్తిగా తెలియదని అంటున్నారు ఐసీఎస్ నిపుణుల. 'మనకి మరో నెల సమయం ఉంది. ఏప్రిల్‌ చివరి నాటికి లేక మే తొలి వారం నాటికి దేశంలో కరోనా కేసులు తీవ్రతరమయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు అని పేర్కోంది.

అయితే, పకడ్బందీగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ అమలు చేయడంతో దీని ప్రభావం కాసింత తగ్గే అవకాశం కూడా వుందని ఇండియన్‌ చెస్ట్‌ సొసైటీ చీఫ్ క్రిస్టోఫర్ తెలిపారు. లాక్ డౌన్‌ చర్యలతో తప్పకుండా కరోనా వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉందని వివరించారు. కాగా, కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో తీసుకుంటున్న చర్యలు, వైద్య సిబ్బంది రక్షణ వంటి అంశాలపై ఐసీఎస్ స్పందిస్తూ..  కరోనా ఐసోలేషన్‌ వార్డుల్లో వైద్య సిబ్బంది ప్రతిరోజు ఏకధాటిగా 10 గంటల కన్నా అధిక సమయం పనిచేయడం ప్రమాదకరమని ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles