6 killed in lorry-truck collision on ORR ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

6 killed 6 injured in lorry truck collision in hyderabad

coronavirus in india, coronavirus, covid-19, Lockdown, Road accident, Pedha golconda, karnataka labour, raichur, Osmania Hospital, gujarat, Lorry, Mangoes, nuziveedu, Hyderabad, coronavirus, Lockdown, telangana covid 19, Hyderabad, Telangana, crimei, coronavirus in gujarat, coronavirus in india latest news

Six people were killed after a lorry rammed into Bolero truck near Outer Ring Road (ORR) at Pedha Golconda of Rangareddy district on Saturday morning. Out of the total, five of them died on the spot and a woman died while undergoing treatment at Osmania General Hospital.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

Posted: 03/28/2020 11:16 AM IST
6 killed 6 injured in lorry truck collision in hyderabad

ఔటర్ రింగురోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.  పోలీసుల కథనం ప్రకారం.. పనులు లేకపోవడంతో కర్ణాటకకు చెందిన 30 మంది కూలీలు స్వగ్రామం అయిన రాయచూర్‌కు బొలేరో ట్రక్‌లో బయలుదేరారు. ఔటర్ రింగు రోడ్డు మీది నుంచి వీరు వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ సమీపంలో వెనక నుంచి వచ్చిన ఓ లారీ.. బొలేరోను బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో బొలేరో డ్రైవర్ సహా ఐదుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఆరుగురు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఓ చిన్నారి, బాలిక ఉన్నారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ నూజివీడు నుంచి గుజరాత్‌కు మామిడి కాయల లోడుతో వెళ్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Road accident  Pedha golconda  Hyderabad  coronavirus  Lockdown  telangana covid 19  Hyderabad  Telangana  crime  

Other Articles