7 year battle has come to an end, says Nirbhaya Mother నిర్భయ కేసు: న్యాయం జరిగిందన్న ఆశాదేవి

Nirbhaya case proud to be known as nirbhaya s mother says asha devi

nirbhaya, 2012 Nirbhaya,2012 Nirbhaya murder case,death penalty nirbhaya case,death row nirbhaya,hang the rapists,hanging nirbhaya convicts,hanging of nirbhaya convicts,justice for nirbhaya,mercy petition nirbhaya convicts,Nirbhaya,Nirbhaya case,nirbhaya case convict pawan gupta,nirbhaya convicts,nirbhaya convicts executed,nirbhaya convicts hanged,nirbhaya convicts hung,nirbhaya convicts killed,nirbhaya hanging,nirbhaya hanging tihar,Nirbhaya rape case,nirbhaya supreme court,nirbhaya supreme court verdict,pawan gupta hanged,pawan gupta petition,Tihar jail Home

Nirbhaya's mother, who has waited with baited breath to see the day when finally her daughter's rapists would be hanged, could not contain her satisfaction when the confirmation of hanging of four convicts in the gang rape and murder case came in a little after 5.35 a.m. on Friday. "Proud to be known as Nirbhaya's mother. She fought so hard. And I have waited long to see this day. The flaw in our justice system were exposed. But finally all four were hanged in one go.

నిర్భయ కేసు: ఎట్టకేలకు న్యాయం చేకూరిందన్న బాధితురాలి తల్లి ఆశాదేవి

Posted: 03/20/2020 09:57 AM IST
Nirbhaya case proud to be known as nirbhaya s mother says asha devi

దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఇవాళ తెల్లవారుజామున తీహార్ జైలు అధికారులు ఢిల్లీలోని పటియాల న్యాయస్థానం అదేశానుసారి నలుగురు దోషులకు ఒకేసారి మరణశిక్షను అమలు చేయడంపై నిర్భయ తల్లి ఆశాదేశి సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన కూతురికి ఏడేళ్లు 3 నెలల తరువాత ఎట్టకేలకు న్యాయం దక్కిందని అన్నారు. ఎన్నాళ్లుగానో న్యాయం కోసం వేచి చూస్తున్న అమె ఆత్మకు ఇన్నాళ్లకు శాంతి చేకూరిందని అశాదేవి అన్నారు.

రాజధానిలో కదులుతున్న బస్సులో ఫిజియోథెరఫీ డాక్టరు కోర్పు చేస్తున్న యువతిపై అత్యంత పాశవికంగా సామూహిక అఘాయిత్యం, హత్య కేసులో నలుగురు దోషులకు ఇవాళ తెల్లవారుజామున 5.30 నిమిషాలకు తీహార్ జైలు అధికారులు ఉరి శిక్ష విధించారన్న వార్త తెలుసుకున్న అమె.. మీడియాకు విజయ చిహ్నం చూపించారు. ఏడేళ్లుగా తాము ఎదురుచూస్తున్న న్యాయం ఎట్టకేలకు దక్కిందని అమె పేర్కోన్నారు. తన కూతురి మరణానికి కారణమైన వాళ్లకు శిక్ష అమలు జరిగిందని తెలిసిన తరువాత అమె తన కూతురు నిర్భయ ఫోటోను తీసుకుని గుండెలకు హత్తుకుని కన్నీళ్ల పర్యంతమయ్యారు.  

తన కుమార్తె లేదని, ఇకపై రాదని పేర్కొన్న ఆమె.. కుమార్తెను కోల్పోయిన తర్వాత తాము పోరాటం ప్రారంభించినట్టు చెప్పారు. ఇప్పటి వరకు తమ పోరాటం నిర్భయ గురించేనని, ఇకపై ‘మన కుమార్తె’ల కోసం పోరాడతానని చెప్పారు. దోషులకు ఉరిశిక్ష అమలు జరిగిన వెంటనే తన కుమార్తె ఫొటోను హత్తుకున్న అనంతరం మీడియాతో ఆశాదేవి ఉద్వేగభరితంగా అన్నారు. మొత్తానికి వారికి ఉరిపడిందని పేర్కొన్న ఆశాదేవి.. ఇదో సుదీర్ఘకాల బాధ అని అన్నారు. ఇన్నాళ్లకు తమకు న్యాయం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజును దేశంలోని అందరి కుమార్తెలకు అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. భారత ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు ఆశాదేవి కృతజ్ఞతలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh